అన్నివర్గాల ప్రజలకు న్యాయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అన్నివర్గాల ప్రజలకు న్యాయం


ఏలూరు, జూన్ 11  (way2newstv.com
అందరి సమస్యలు పరిష్కరిస్తా..పూర్తిస్తాయిలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , వైద్యఆరోగ్యశాఖ మంత్రి  ఆళ్ట కాళి కృష్ణ (నాని) చెప్పారు. స్థానిక శ్రీరామ్ నగర్ లోని మంత్రి కేంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం నుండి వివిధ వర్గాల ప్రజలు ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు వందలాది మంది శ్రీ ఆళ్లనానీకి పుష్పగుచ్చాలు అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వెల్లువలా తరలివచ్చిన ప్రజలను చూసి శ్రీఆళ్లనాని 15 రోజుల్లో అందరిసమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తానని , అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజలకు మరింత చేరువఅవుతానని చెప్పారు. ఒకప్రక్క అమరావతి రాజధానిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ మరోవైపు ఉదయం నుండి వెల్లువగా వస్తున్న ప్రజలను కలుసుకుంటూ వారి అభిమానాన్ని చూస్తుంటే తనజీవితం ఎంతో ధన్యమైనదని భావిస్తున్నానని నాని చెప్పారు. 


అన్నివర్గాల ప్రజలకు న్యాయం
ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ప్రతి వాగ్ణానాన్ని నెరవేర్చడంలో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్దిని స్పూర్తిగా తీసుకుని ఏలూరు అసెంబ్లి నియోజకవర్గ పరిధిలోని వివిధి కాలనీలలో వివిధ ప్రాంతాలలో ప్రజలకిచ్చిన అన్ని వాగ్జానాలను నెరవేరుస్తానని, ఇచ్చిన ప్రతిమాట తనకు గుర్తున్నదని కొద్దిసమయం ఇస్తే అందరికీ అవసరమైన ప్రధాన సమస్యలను పరిష్కరించి ప్రజలను న్యాయం చేకూరుస్తానని మంత్రి చెప్పారు. ప్రతి గృహిణికి సొంతఇల్లు సాకారం చేస్తానని ఉగాధినాటికల్లా అర్హతగల ప్రతి మహిళకు ఇళ్లస్థల పట్టా ఇవ్వడమే కాకుండా గృహనిర్మాణానికి తగు చేయూత అందిస్తామని చెప్పారు. రాబోయే నాలుగేళ్లకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది పేదలకు ఇళ్లునిర్మించి ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి ధ్వేయమని ఆదిశగా జిల్లాలో అర్హతగల వారి జాబితాలను సిద్దం చేయాలని చెప్పారు. గృహనిర్మాణశాఖ ఉద్యోగుల జిల్లా కార్యవర్గం మంత్రి కి వినతిపత్రం అందిస్తూ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉధ్యోగులుగా గుర్తించాలని కోరారు. దీనిపై  నాని స్పందిస్తూ ఈవిషయంపై ముఖ్యమంత్రి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని నిర్దిష్ట ప్రణాళికతో అందిరి ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని, ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి అండగా నిలబడి అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకువెళ్లి న్యాయం చేస్తానని ఉధ్యోగులకు మంత్రి  అభయం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి  శంకరరావు, డిఎస్‌పి  మురళీకృష్ణ, రవాణాశాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.