రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా ఆశావర్కర్లు ఆనందంగా జీవించేలా జీతాలు పెంచడం తాము జీవితాంతం జగన్ కు ఋణపడి ఉంటామని ఆశావర్కర్లు ఆనందం వ్యక్తంచేశారు. స్థానిక మంత్రి కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం జిల్లా నలుమూలలనుండి వందలాది మంది ఆశావర్కర్లు తరలివచ్చి ఆరోగ్యశాఖమంత్రికి పుష్పగుచ్చాలు అందించడమే కాకుండా సత్కరించి అభినందనలు తెలిపారు.
ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాము
ఈ సందర్భంగా ఆశావర్కర్లు అనిత, మేరీ, కుమారి తదితరులు మాట్లాడుతూ తాము ఆశించినదానికన్నా జీవితంలో మరిచిపోలేని విధంగా మూడువేలు నుండి 10 వేల రూపాయలకు వేతనం పెంచుతూ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆశావర్కర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని, ప్రతి ఆశావర్కర్ భవిష్యత్‌లో ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పేదప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తామని చెప్పారు. వచ్చే వర్షాకాలంలో ప్రతిఇంటా పెద్దఎత్తున మొక్కలు నాటేలా ఆశావర్కర్లు తగుశ్రద్దవహించాలని ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలంటే మొక్కలు పెంపకం ఎంతో అవసరమని ప్రజలకు వివరించాలని సూచించారు.
Tags:
Andrapradeshnews