కొందామంటే కొరివిగా ఇసుక - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొందామంటే కొరివిగా ఇసుక


విజయవాడ, జూన్ 26, (way2newstv.com)
ఇప్పటి వరకు ఉచితంగా లభించే ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ నూతన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం భవన నిర్మాణాలపై పెను భారం చూపుతుంది. ఉచిత ఇసుక విధానం ఉన్నఫళంగా రద్దు చేసిన ప్రభుత్వం ఇంకా నూతన ఇసుక విధానం అమలు చేయకపోవడంతో ప్రస్తుతం ఇసుకు ఉచితం లేకపోగా కొందామంటే కొరివిగా తయారయ్యింది. రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా అక్రమార్కులు ఇసుకను భారీ ధరకు విక్రయిస్తున్నారు. దీని కారణంగా భవన నిర్మాణం ప్రస్తుతం భారంగా మారుతోంది. ఉచిత ఇసుక విధానంపై ప్రస్తుతం ప్రభుత్వం ఆంక్షలు విధించినా అక్రమార్కులు రెచ్చిపోతూ తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. చూస్తున్న అధికారులు వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా సాహసించడం లేదు. రాష్ట్ర వ్యాప్తం ఇసుకర అక్రమ రవాణా అవుతుందని నూతన రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. దీనికారణంగా ప్రస్తుతం ఇసుకకు భారీగా కొరత ఏర్పడింది. దీన్ని అదునుగా చూసుకున్న అక్రమదారులు యథేచ్ఛగా ఇసుకను తవ్వుకుంటూ యూనిట్‌ను ప్రస్తుతం రూ.5వేల నుండి అమ్మకాలు చేస్తున్నారు. 

కొందామంటే  కొరివిగా ఇసుక


భవన నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన ఇసుకను తప్పని పరిస్థితుల్లో అధిక ధరకు భవన నిర్మాణ దారులు కొనుగోలు చేస్తున్నారు.ఉచిత ఇసుక విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పి, కొత్త విధానం అమలు చేసేందుకు సిద్ధమైంది. అయితే ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు చరుగుతున్న నూతన విధానంపై స్పష్టత మాత్రం లభించడం లేదు. దీని కారణంగా భవననిర్మాణ రంగం ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తున్నా, నూతన విధానం తయారీకి మాత్రం ఎంతో సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుక రవాణాపై అధికారులు దృష్టి సారించి కొరడా ఝులిపిస్తున్నారు. దీని కారణంగా ఇసుక ధర అమాంతం పెరిగింది. జిల్లాలో అనుమతులు ఉన్న ఇసుక ర్యాంపులతో పాటు అనుమతి లేని ప్రాంతాల్లో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. నూతన విధానం అమలులోనికి వచ్చే వరకు అయినా పాత విధానం అమలు చేయాలని భవన నిర్మాణ దారులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఆగని దందా..ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు రెవెన్యూ, అటు పోలీసులు హెచ్చరిస్తున్నా జిల్లాలో మాత్రం ఇసుక దందా కొనసాగుతునే ఉంది. గత ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను అరికట్టలేకనే ఉచిత ఇసుక పాలసీని తీసుకు వచ్చింది. ప్రస్తుతం అదికూడా సక్రమంగా అమలు కాకపోగా, ఇసుక అక్రమ రవాణా మరింత పెరిగిందని భావిస్తున్న నూతన రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానం అమలులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రవాణాపై పూర్తిగా ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం విధించింది. నిబంధనల ప్రకారం సొంత ప్రదేశాల్లో ఉన్న ఇసుకను కూడా తీయడానికి వీలు లేకుండా నిబంధనలను ప్రస్తుతం అమలు చేస్తుంది. అయితే రాత్రి సమయంలో మాత్రం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమణదారులు యథేచ్ఛగా ఇసుకను క్యారీల ద్వారా తవ్వకాలు చేస్తున్నారు. జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో అత్యధికంగా లభించే ఇసుకను మంచి గిరాకీ ఉంది. అదే ఆక్రమణదారులకు కాసులను కురిపిస్తుంది. అక్రమ మైనింగ్ చేస్తున్న కొందరు ఇసుకను రహస్యంగా తవ్వకాలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు. రాత్రి సమయాల్లో గ్రామల గుండా పెద్ద ఎత్తున ఇసుక లారీలు, ట్రాక్టర్ల ద్వారా రవాణా అవుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇసుక డంప్‌లను అక్రమ దారులు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ డంప్‌లకు పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. వీటిని అధికారులు చూసి చూడనట్లు వదిలేయడంతో వారు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.