ప్రతిపక్ష నేతలతో పార్లమెంటరీ మంత్రి భేటీ


న్యూఢిల్లీ, జూన్ 7, (way2newstv.com)
పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియాగాంధీని కలిశారు. ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రహ్లాద్ జోషి సమావేశాలపై చర్చించేందుకుగాను సోనియాగాంధీని కలిశారు. 


ప్రతిపక్ష నేతలతో పార్లమెంటరీ మంత్రి భేటీ
పార్లమెంట్ సమావేశాలు జులై 26 వరకు కొనసాగనున్నాయి. జులై 5న ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అదేవిధంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, లోక్‌సభలో డీఎంకే నాయకుడు టీ.ఆర్.బాలును ప్రహ్లాద్ జోషి కలిసి సమావేశాలపై చర్చించారు
Previous Post Next Post