మయూరి ఎకో పార్క్ లో కాన్ఫరెన్స్ హాల్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్


పాలమూరును పర్యాటక హబ్    గా తీర్చిదిద్దుతామని వెల్లడి
మహబూబ్ నగర్ జూన్ 29, (way2newstv.com)
మయూరి ఎకో పార్కులో నూతనంగా నిర్మించిన మహేందర్ కాన్ఫరెన్స్ హాలును శనివారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు...
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అత్యంత  ప్రతిష్టాత్మక టూరిజం ప్రాజెక్టుగా మయూరి ఎకో పార్కును రూపొందిస్తున్నట్లు తెలిపారు...ఇప్పటికే రెయిన్ ఫారెస్ట్ గార్డెనింగ్ ట్రెక్కింగ్ హట్స్ తో బాటుగా కృత్రిమ జలపాతాలు తదితర టూరిజం అట్రాక్షన్స్ ను మయూరి లో ఏర్పాటు చేశామన్నారు..

మయూరి ఎకో పార్క్ లో కాన్ఫరెన్స్ హాల్ ను ప్రారంభించిన మంత్రి  శ్రీనివాస్ గౌడ్


పాలమూరు ను పర్యాటక హబ్గా మార్చడమే తన లక్ష్యమని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు...ఈ కార్యక్రమంలో కలెక్టర్ రోనాల్డ్ రోస్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధా అమర్ జిల్లా అటవీ శాఖ అధికారి గంగా రెడ్డి తెరాస పట్టణ అధ్యక్షులు కొరమొని వెంకటయ్య వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ రాజేశ్  తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post