ఆషాడ బోనాలకు ఏర్పాట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆషాడ బోనాలకు ఏర్పాట్లు


హైదరాబాద్, జూన్ 10 (way2newstv.com
అషాడబోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాడానికి 15 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల పండుగ ఏర్పాట్లపై రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమ్ముద్ అలీ,  దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి  సోమవారం సచివాలయంలో  సమీక్షించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  మాట్లాడుతూ జులై 4 న గోల్కొండ బోనాలు, జులై 21 న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, జులై 28 న పాతబస్తీలో బోనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి ద్వారా 22 కోట్ల తో  వివిధ పనులకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు  తెలిపారు. రోడ్ల మరమ్మత్తులు సానిటేషన్ ఏర్పాట్లను దేవాలయాల వద్ద లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం హైదరాబాద్ లో మెట్రో వాటర్ వర్క్స్ 3 లక్షల పైన త్రాగు నీటి ప్యాకెట్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. భక్తులకు ఆర్ అండ్ బి శాఖ ద్వారా దేవాలయాల వద్ద బారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా అదనపు ట్రాన్స్ ఫార్మర్లను  ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ కమిటీల దృష్టికి ఏవైన సమస్యలు గుర్తించినట్లయితే తన దృష్టికి తేవాలని కోరారు. 


ఆషాడ బోనాలకు ఏర్పాట్లు
దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ సహకారంతో సాంస్కృతిక, భక్తి, అత్యాధ్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలీస్ శాఖ  పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ కార్యక్రమాలను పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదారాబాద్  మెట్రో రైల్ బోనాలకు భక్తుల సౌకర్యార్ధం అదనపు ట్రిప్ లను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు అవసరమైన ఏనుగును ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులను కోరారు.  తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రంజాన్, క్రిస్టిమస్, దసరా, బోనాలు పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమ్ముద్ అలీ మాట్లాడుతూ  జులై 4  వ తేది నుండి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణకు అధికారులు అన్ని పనులను ముందస్తుగనే పూర్తి చేయాలని ఆదేశించారు. పండుగ నిర్వహణకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు.రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కంటే మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చెయ్యాలని అధికారులను కోరారు. 26 దేవాలయాలకు పట్టు వస్త్రాలను పంపనున్నట్లు తెలిపారు. పురోహితులను, ప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో, ఆర్.అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరి సునీల్ శర్మ, ఎంఎల్ ఏలు  దానం నాగేందర్, రాజాసింగ్, ముఠాగోపాల్, మాగంటి గోపినాధ్, జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అధర్ సిన్హా, ఇంచార్జీ కమీషనర్, లా అండ్ ఆర్డర్ డిజి జితేందర్, జిహెచ్ఎంసి కమీషనర్, యండి వాటర్ వర్క్స్ దానకిషోర్, ఎండోమెంట్స్ కమీషనర్ అనీల్ కుమార్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ట్రాన్స్ కో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ దేవాలయాల పాలక మండల్లు, భక్తులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.