తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటే రేషన్ కార్డు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటే రేషన్ కార్డు


హైద్రాబాద్, జూన్ 28 (way2newstv.com)
దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా కేంద్రం కీలక అడుగులేస్తోంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పేరిట దేశవ్యాప్తంగా ఎక్కడైనా లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ఉన్నవారు తెలంగాణలో, తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారు ఏపీలోని రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ఆహార భద్రతపై ఫుడ్‌ కార్పొరేషన్‌, కేంద్ర, రాష్ట్ర గోడౌన్ల సంస్థ అధికారులు, రాష్ట్రాల ఆహార శాఖ కార్యదర్శులతో భేటీ అయిన మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఎదురవుతోన్న ఇబ్బందులను అధిగమించడం కోసం ఏం చేయాలనే విషయమై ఈ భేటీలో చర్చించారు. కంప్యూటరీకరణ, ఆహార ధాన్యాల నిల్వ, పంపిణీలో పారదర్శకతతోపాటు ఎఫ్‌సీఐ, సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ డిపోలను ఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకురావడం లాంటి అంశాలను చర్చించారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటే రేషన్ కార్డు

వన్ నేషన్, వన్ రేషన్ కార్డు పథకం అమల్లోకి వస్తే.. రేషన్ దుకాణాల్లో అక్రమాలు తగ్గుముఖం పడతాయని, వలస కార్మికుల లాంటి వారికి మరింత ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ పీడీఎస్ ఇప్పటికే ఏపీ, తెలంగాణ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఈ రాష్ట్రాల ప్రజలు తమ రేషన్ సరుకులను ఆ రాష్ట్ర పరిధిలోని ఏ జిల్లాలోనైనా తీసుకునే వెసులుబాటు ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఐఎంపీడీఎస్‌ను త్వరలోనే అమలు చేయనున్నారు. వచ్చే రెండు నెలల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డును తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయనున్నారు. తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేస్తారు. ఇలా చేయడం వల్ల కార్డుల డూప్లికేషన్‌ను కూడా అరికట్టొచ్చనేది కేంద్రం ఉద్దేశం. రేషన్ షాపుల ద్వారా ఏటా 81 కోట్ల మంది లబ్ధిదారులకు 612 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అందజేస్తున్నారు జాతీయ ఆహార భద్రత చట్టం సహా పలు అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇకపై దేశంలో ఎవరైనా, ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునే విధానాన్ని తీసుకురాబోతున్నట్టు తెలిపారు. ఇందుకోసం దేశంలో ఎక్కడైనా పనిచేసేలా రేషన్‌కార్డుల విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ విధానం వలసదారులకు వరంగా మారుతుందన్నారు.నిజానికీ విధానం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతోంది. రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ విధానం అమలుకు నడుం బిగించాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్రం ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ దిశగా అడుగులు వేస్తోంది.