హైదరాబాద్ టూర్ కేవలం రూ.789కే! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హైదరాబాద్ టూర్ కేవలం రూ.789కే!


హైద్రాబాద్, జూన్ 7 (way2newstv.com)
రైల్వే టికెటింగ్ ప్లా్ట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ తాజాగా చౌక ధరలోనే అదిరిపోయే టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. హెరిటేజ్ హైదరాబాద్ టూర్ ప్యాకేజ్ దీని పేరు. ఈ టూర్ ప్యాకేజ్ ధర కేవలం రూ.789 నుంచి ప్రారంభమౌతోంది. టూర్ ప్యాకేజ్‌లో భాగంగా హైదరాబాద్ సిటీ మొత్తం చూపిస్తారు.


హైదరాబాద్ టూర్ కేవలం రూ.789కే!
ట్రైన్ నెంబర్. 12650, 12722, 17031, 11019, 12514, 12603, 17651, 12759, 17019, 19713, 17038, 12772, 18112,17604, 12193, 12736, 12592, 12786, 22691, 12213, 12514, 17015, 12727, 12783, 22203, 12739లలో టికెట్లను బుక్ చేసుకున్న వారు లక్ష్యం ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజ్ రూపొందించింది. ఈ ట్రైన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లకు ఉదయం 6 నుంచి 9 గంటల మధ్యలో వస్తాయి. టూర్ బస్ సోమవారం, శుక్రవారం మినహా మిగతా రోజులలో అందుబాటులో ఉంటుంది. హోటల్ లేదా స్టేషన్ నుంచి టూర్ బస్సు ఉదయం ప్రయాణికులను పికప్ చేసుకుంటుంది. ట్యాంక్‌బండ్, బిర్లా మందిర్, సాలార్‌జంగ్ మ్యూజియం, మక్కా మసీజ్, చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహి థంబ్స్ వంటి పలు ప్రదేశాలను చూపిస్తారు. సాయంత్రం కల్లా టూర్ అయిపోతుంది. మళ్లీ హోటల్ లేదా రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు.