రాష్ట్రవ్యాప్తంగా 108 సిబ్బంది సమ్మె - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాష్ట్రవ్యాప్తంగా 108 సిబ్బంది సమ్మె

అమరావతి, జూలై 23, (way2newstv.com)
రాష్రవ్యాప్తంగా 108 ఉద్యోగులు సోమ వారం రాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగారు.  ప్రధానంగా వేతన బకా యిలు చెల్లించాలని, గత జీవీకే సంస్థ నుంచి ఒక్కొక్క ఉద్యోగికి రావలసిన రూ.70 నుంచి 80 వేల రూపాయలు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో వున్న 43 వాహనాలలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పైలెట్లు (డ్రైవర్లు) కలిపి 193 మంది పనిచేస్తున్నారు. 
రాష్ట్రవ్యాప్తంగా 108 సిబ్బంది సమ్మె

వీరందరికీ రెండు నెలలుగా బీవీజీ సంస్థ నుంచి జీతాలు రావలసి ఉంది.  అదేవిధంగా గతంలో 108 సేవలు నిర్వహించిన జీవీకే సం స్థ నుంచి ఒక్కొక్క ఉద్యోగికి రూ.70 నుంచి రూ.80 వేల వేతన బకాయిలు రావలసి ఉంది. ఈ బకాయిలు చెల్లిం చాలని కొన్ని నెలలుగా 108 ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.  గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తాజాగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభు త్వం కూడా సమస్య పరిష్కరించడం లేదంటూ సోమవారం రాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగారు. నెల్లూరు జిల్లా లో పోమవారం రాత్రి నుండి జిల్లాలో 108 సేవలు  నిలిచి పోయాయి. జీతాలు సరిగా చెల్లించడంలేదని,వాహనాల యొక్క కండిషన్లు సరిగా లేవని రాష్ట్ర 108.యూనియన్ పిలుపు మేరకు రాష్ట్రంలో సమ్మె నిర్వహిస్తున్నట్లు సిబ్బంది తెలియజేశారు.