రేణిగుంట, జూలై 23 (way2newstv.com)
తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంద్రప్రదేశ్ కు కొత్తగా నియమించిన రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్, అయన కుటుంబ సభ్యులకు మంగళవారం ఉదయం 11.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం లో ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్త, నగర పాలక కమిషనర్ పి.ఎస్.గిరీషా, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జెఇఓ బసంత్ కుమార్, మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి,
ఆంద్రప్రదేశ్ కొత్త గవర్నర్ కు ఘనస్వాగతం
వెస్ట్ డి ఎఫ్ ఓ సునీల్ కుమార్ రెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్.పి.అన్బు రాజన్, తిరుపతి ఆర్.డి.ఓ.కనక నరసా రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ విజయసింహా రెడ్డి, సెట్విన్ సి.ఇ. ఓ. లక్ష్మీ,బిజెపి నాయకులు కోలాఆనంద్ స్వాగతం పలికరు. డీఎస్పీ లు చంద్రశేఖర్, సాయి గిరిధర్ , సిఐ అంజు యాదవ్, రెవెన్యూ డిటీలు ఈశ్వర్, శ్యాంప్రసాద్ , ఇతర అధికారులు ఏర్పాట్లు పర్వవేక్షించారు. అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి రోడ్డు మార్గాన తిరుమల బయలు దేరారు.
Tags:
News