ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు

డిస్కింలు, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇస్తేనే, విద్యుత్ సరఫరా
విజయవాడ, జూలై 29, (way2newstv.com
ఇప్పటికే అనాలోచిత నిర్ణయంతో, విద్యుత ఒప్పందాల సమీక్ష పై, కోర్ట్ ల చేత మొట్టికాయలు తింటున్న రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రం చెప్పిన న్యూస్ తో మరో షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నిబంధన తీసుకువచ్చింది. రాష్ట్ర డిస్కింలు, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇస్తేనే, విద్యుత్ సరఫరా చెయ్యాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన ఆగష్టు 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిబంధన  ప్రకారం, విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వం తరుపున చెల్లింపుల భద్రత చూపితేనే, విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర డిస్కింలు రూ.20 వేల కోట్ల బకాయిలు పడ్డాయి. ఈ బకాయలు ప్రతి నెల పెరుగుతూ పోతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా కేంద్రం తీసుకు వస్తున్న ఈ నిబంధన అమలులోకి వస్తే, ప్రతి రోజు రాష్ట్ర డిస్కింలు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లింపులు చెయ్యాలి.ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే విద్యుత్ కు, ఆ రోజుకి ఆ రోజు, బ్యాంక్ నుంచి చెల్లించే ఏర్పాటు చెయ్యాలి. 
ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు

ఒకవేళ కనుక డిస్కింలు చెల్లింపులు చెయ్యకపోతే, రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇస్తేనే, ఆగష్టు 1 వ తారీఖు నుంచి, కేంద్ర సంస్థల నుంచి మనకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. అయితే ఈ నిబంధన అంగీకరించటానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిద్ధంగా లేదు. ఈ మేరకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇవ్వటం కుదరదు అని, రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్రానికి లేఖ రాసారు. కేంద్రం దానికి ఎలాంటి రిప్లై ఇస్తుంది, ఏమి సూచనలు చేస్తుంది, అసలు ఒప్పుకుంటుందా లేదా అనే దాని గురించి, రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది.ఏపి జెన్కో ద్వారా తీసుకున్న విద్యుత్ ను, డిస్కింల ద్వారా, ఇళ్ళకు, పొలాలకు, కంపెనీలకు సరఫరా చేస్తారు. అయితే, విద్యుత్ బిల్లులు వసూలు చేసి, డిస్కింలు, జెన్కోకు చెల్లించాలి. అయితే బిల్లులు చెల్లింపులు ఆలస్యం అవ్వటం, విద్యుత్ చోర్యం, సాంకేతిక నష్టాలు కారణంగా, ఇప్పటి వరకు డిస్కంల నష్టాలు 20 వేల కోట్లకు చేరాయి. ఇవి తిరిగి చెల్లించే పరిస్థితి ఇప్పుడు లేదు. దీంతో విద్యుత్ ఉత్పత్తి భారంగా మారుతుంది. మరో పక్క, బొగ్గు , రవాణా చార్జీలు పెరిగాయి. ఇవన్నీ చూసిన కేంద్రం, బకయాలు భారాన్ని ఇక ఏ మాత్రం మొయ్యటానికి సిద్ధంగా లేదు. అందుకే ఆ బాధ్యతను రాష్ట్రాలకు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదు. మరి కేంద్రం కనుక దిగి రాక పోతే, పరిస్థితులు ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. విద్యుత్ ఒప్పందాల సమీక్షలా కాకుండా, ఇదైనా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా చేస్తుందో లేదో చూద్దాం.