దక్షిణాది రాష్ట్రాలపై వరుణుడు కన్నేర్ర చేస్తున్నాడు. భారీగా కురుస్తున్న వర్షాలకు వరదలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ లాంటి గ్రామాలు జగదిగ్బందంలో చిక్కుకుంటే ముంబై లాంటి మహానగరాల్లో జనజీవనం స్ధంభించింది. ఏది ఊరు, ఏది వాగు తెలియని స్ధితిలో వరద నీరు జనవాసాల్లోకి చొచ్చుకొచ్చింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు అస్ధవ్యస్ధంగా మారాయి. విశాఖ మన్యంలో మూడు రోజుల నుంచి తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వానలతో మారుమూల గ్రామాల్లోని జనజీవనం స్తంభించింది. గెడ్డలు ఉద్ధృతంగా ప్రవహించటం వల్ల చాలావరకు ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
ఏపీలో భారీ వర్షాలు
ఆదివారం భారీ వర్షం పడటంతో పెదబయలు మండలం రూఢకోట మార్గంలో ఉన్న గెంజిగెడ్డ ఉప్పొంగి ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గిరిజన ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నా నష్టాలు ఎక్కడా నమోదు `కాలేదని అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో మండల, డివిజన్ స్థాయి యంత్రాంగం యావత్తూ అప్రమత్తంగా ఉండాలని, తహసిల్దార్లు, ఇతర శాఖలకు చెందిన అధికారులు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని కలెక్టరేట్ అధికారులు సూచించారు. గిరిజన ప్రాంతం మినహా మిగతా ప్రాంతాల్లో మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు.విశాఖ జిల్లా మన్యంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మండల కేంద్రాలతో గ్రామాలకు సంబంధాలు .గ్రామీణ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తు న్నాయి.ముంచంగి పుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ కర్లపొదోర్ సమీపంలోని కల్వర్టు.. వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో 27 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే ఒడిశా రాష్ట్రంలోని పంచాయతీలకు చెందిన 53 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.ముముంబైలో రహదారులపై భారీగా నీరు చేరడంతో ప్రజల అవస్ధలు పడాల్సిన దుస్ధితి ఎదురైంది.విశాఖలో మాత్రం మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలుఉన్నాయి.
Tags:
Andrapradeshnews