అనంతలో 40 శాతమే సాగు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనంతలో 40 శాతమే సాగు

అనంతపురం, జూలై 25, (way2newstv.com)
అనంతపురం జిల్లాలో 6 లక్షలకు పైగా హెక్టార్లు వ్యవసాయానికి అనుకూలంగా ఉండగా ఇప్పటివరకు 2,52,821 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. మొత్తం 40 శాతంగా నమోదైంది. .రాష్ట్రంలోనే అతి తక్కువ వర్షపాతం పడిన మండలాలు, తక్కువ వర్షం కురిసిన మండలాల సంఖ్యలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉంది. కౌతాళం, దొర్నిపాడు, గోస్పాడు, కోవెలకుంట్ల, సంజామల, డోన్‌, తుగ్గలి, మద్దికెర మండలాల్లో అతి తక్కువగా వర్షపాతం నమోదైంది. 24 మండలాల్లో సాధారణాని కంటే తక్కువగా పడింది. కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడుతుండడంతో సాగుకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతోంది.రైతులు ఎక్కువగా పత్తి సాగు చేయగా.. ఆ తర్వాత వేరుసెనగకు ప్రాధాన్యమిచ్చారు. మొదట్లో తొలకరి వర్షాలు బాగానే కురిసినా ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. 
అనంతలో 40 శాతమే సాగు

అన్నదాతలు సాగుకు ముందడుగు వేసినా వర్షం జాడ లేక.. వేసుకున్న పంటలను బతికించుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు. జూదంలా మారిన ఆశల సేద్యంలో వర్షాభావ పరిస్థితులతో పుడమిపుత్రుల పరిస్థితి దైన్యంగా మారింది. ఈ ఖరీఫ్‌లో జూన్‌లో సాధారణ వర్షపాతం 77.2 మి.మీ. కాగా ఇప్పటివరకు 73.5 మి.మీ. వర్షం పడింది. సాధారణం కంటే -5 శాతం తక్కువ నమోదైంది. జులైలో 117.2 మి.మీ. సాధారణ వర్షపాతం కాగా గడిచిన 23 రోజుల్లో 51.7 మి.మీ. మాత్రమే పడింది. - 56 శాతం వర్షపాతం లోటు ఉంది. గతేడాది ఖరీఫ్‌లో జూన్‌లో 109.2 మి.మీ. పడగా.. జులైలో 63.5 శాతంగా నమోదైందిజిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. చినుకు జాడ లేకపోవడంతో వారు అల్లాడుతున్నారు. ఇప్పటికే వేలాది రూపాయలు వెచ్చించి విత్తు వేసుకొన్నారు. మొదట్లో వర్షం పడినా ఆ తర్వాత వర్షాలు పడకపోవడంతో ఇప్పటికే మొలకలు వాడుముఖం పట్టాయి. మరో రెండు, మూడు రోజుల్లో వరుణుడు కరుణించకుంటే పూర్తిగా నష్టపోయే ప్రమాదముంది. గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో చాలామంది వ్యవసాయంపై ఆశలు వదిలేసుకొంటున్నారు.ఎర్ర నేలల్లో పత్తి సాగు చేయొద్దని అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నా రైతులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా పంటలు తెగుళ్లబారిన పడుతున్నాయి. మరోవైపు తాము సూచించిన సమయాల్లో పంటలు వేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. జులైలో ఎర్రనేలల్లో వేరుశనగ, కంది, ఆముదం, జొన్న, అలసందలు, కొర్రలు, సజ్జలు వేసుకొనేందుకు అనుకూలం. ఆగస్టులో వేరుసెనగ వేయకూడదు. కంది, ఆముదం, జొన్న, సజ్జ, ఉలవలు, అలసందలు, కొర్రలు విత్తుకోవచ్చు. సెప్టెంబరులో వేరుశనగ, కంది, ఆముదం పంటలకు అనుకూల సమయం కాదని, కేవలం జొన్న, సజ్జ, అలసందలు, ఉలవలు, కొర్రలకు మాత్రమే అనుకూలమని అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.నల్లరేగడి నేలల్లో జులైలో పత్తి, కంది, ఆముదం, పొద్దుతిరుగుడు, కొర్రలు, మొక్కజొన్న విత్తుకోవచ్చు. జొన్న, పొగాకు వేయకూడదు. ఆగస్టులో పత్తి, కంది, పొద్దుతిరుగుడు, జొన్న, కొర్రలు వేసుకోవచ్చు. మొదటివారంలో మొక్కజొన్న సాగుకు అనుకూలం. సెప్టెంబరు మొదటి వారంలో మొక్కజొన్న, కందికి అనుకూలం కాగా పత్తి, ఆముదం వేసుకోకూడదు. పొద్దుతిరుగుడు, జొన్న, కొర్రలు, పొగాకు విత్తుకోవచ్చు.అక్టోబరులో పత్తి, కంది, ఆముదం, మొక్కజొన్న వేయకూడదు. పొద్దుతిరుగుడు, జొన్న, కొర్రలు, పొగాకు విత్తుకు అనుకూలం.