బిగ్ బాస్ లెక్క తేలినట్టే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బిగ్ బాస్ లెక్క తేలినట్టే

హైద్రాబాద్, జూలై 15, (way2newstv.com)
బిగ్ బాస్’ మూడో సీజన్ మొదలవుతోంది. ఈనెల 21 నుంచి బిగ్ బాస్ రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచనుంది. కింగ్ నాగార్జున తొలిసారి ‘బిగ్ బాస్’ షోను హోస్ట్ చేస్తుండటంతో ఈ మూడో సీజన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దీనికి తగ్గట్టుగానే షో నిర్వాహకులు, స్టార్ మా ఛానెల్ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 100 రోజులపాటు ఈ షోను నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఇదిలా ఉంటే, హౌజ్‌లోకి అడుగుపెట్టనున్న కంటెస్టెంట్లు వీరేనంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. 
బిగ్ బాస్ లెక్క తేలినట్టే

1. నటుడు వరుణ్ సందేశ్ 
2. నటి హేమ 
3. నటి హిమజ 
4. నటుడు తరుణ్ 
5. యాంకర్ ఉదయభాను 
6. గాయకుడు హేమచంద్ర 
7. ‘తీన్‌మార్’ సావిత్రి (యాంకర్ శివ జ్యోతి) 
8. శ్రీరెడ్డి 
9. వైవా హర్ష 
10. యాంకర్ శ్రీముఖి 
11. యాంకర్ లాస్య 
12. మహాతల్లి ఫేమ్ జాహ్నవి 
13. రఘు మాస్టర్ 
14. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ 
15. జర్నలిస్ట్ ‘ముఖాముఖి’ జాఫర్ 
ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న జాబితా మాత్రమే. ఈ జాబితాలో ఒక్క పేరును కూడా ఇంకా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు ఖరారు చేయలేదు. కానీ.. యాంకర్ శ్రీముఖి, ‘తీన్‌మార్’ సావిత్రి, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఖరారయ్యారని ఇండస్ట్రీకి చెందిన కొంత మంది కచ్చితంగా చెపుతున్నారు. అయితే, ‘బిగ్ బాస్’లో చేస్తున్నట్లు వస్తోన్న వార్తలను ఇప్పటికే యాంకర్ లాస్య, ఉదయభాను, తరుణ్ ఖండించారు. తాము ఈ షోలో చేయడం లేదని చెప్పారు. తాను ‘బిగ్ బాస్’లో చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు అంటూ శ్రీరెడ్డి వరుసపెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీళ్లు నలుగురు తప్ప మిగిలిన సెలబ్రిటీలు ఈ వార్తలపై స్పందించలేదు. ‘బిగ్ బాస్’ వార్తలను ఖండించిన ముగ్గురిని పక్కన బెడితే మిగిలిన 12 మంది సెలబ్రిటీల పేర్లు ఖరారేనా అంటే.. చెప్పలేని పరిస్థితి! ఎందుకంటే, ఈ జాబితాలో జర్నలిస్టు జాఫర్ పేరు కూడా ఉంది. టీవీ9 ఛానెల్‌లో ‘ముఖాముఖి’తో బిజీగా ఉండే జాఫర్.. 100 రోజులు హౌజ్‌లో ఉండటానికి అంగీకరించారా? అనే అనుమానం కలుగుతోంది. శ్రీరెడ్డి పేరు జాబితాలో ఉన్నా ఆమెను తీసుకునే ధైర్యం ‘బిగ్ బాస్’ నిర్వాహకులు చేయరని ఇండస్ట్రీకి చెందినవారు అంటున్నారు. మిగిలిన సెలబ్రిటీల పేర్లు మాత్రం నమ్మే విధంగానే ఉన్నాయి. చూద్దాం ఈ జాబితాలో ఎంత మంది హౌజ్‌లోకి వెళ్తారో..!!!