జగన్ జెరూసెలం, అమెరికా పర్యటనలు

విజయవాడ, జూలై 23 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటన ఖాయమైన సంగతి తెలిసిందే. ఆ టూర్‌కే ముందే జగన్ జెరూసలెం వెళ్లనున్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే.. జగన్ కుటుంబం విదేశీ పర్యటనకు వెళ్లనుంది. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి.. ఆగస్టులోనే వైఎస్ జగన్ రెండు దేశాల్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చింది. ఈ నెలాఖరుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి.. ఆ వెంటనే జగన్ నేరుగా హైదరాబాద్ వెళతారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి.. ఆగస్టు 1న జెరూసలెం వెళతారు. ఐదు రోజుల పాటూ అక్కడే పర్యటన ఉంటుంది.. తిరిగి ముఖ్యమంత్రి ఆగస్టు 5న హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి మళ్లీ అమరావతికి రానున్నారు. ఈ పర్యటన ముఖ్యమంత్రి వ్యక్తిగతమైనదని చెబుతున్నారు. 
జగన్ జెరూసెలం, అమెరికా పర్యటనలు

ప్రతి ఏటా వైెఎస్ జగన్ కుటుంబం జెరూసలెం వెళుతుందట.. కానీ ఈసారి ఎన్నికలతో బిజీ కావడంతో పర్యటన వాయిదా పడిందట. జెరూసలెం పర్యటన తర్వాత ఆగస్టులోనే ఆగస్టు 17 నుంచి 23 వరకు.. ముఖ్యమంత్రి జగన్ అమెరికాలో పర్యటిస్తారు. ఈ టూర్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్నారు. 16న హైదరాబాద్ నుంచి బయల్దేరి.. 17న నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ ఆహ్వాన సభలో పాల్గొంటారు. డల్లాస్‌లోని కే బెల్లే కన్వెన్షన్ సెంటర్ ప్రవాస భారతీయులతో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హాజరవుతారు. సీఎం జగన్ మూడు రోజుల క్రితమే.. సాధారణ పాస్‌పోర్ట్ స్థానంలో డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను తీసుకున్నారు. విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీసుకు తన సతీమణి భారతితో వెళ్లి.. పాస్‌పోర్ట్‌ను అందుకున్ననారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్, రాయబారులకి మాత్రమే ఈ పాస్‌పోర్ట్ జారీచేస్తారు. ఈ పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తులకు విమానాశ్రయంలో నేరుగా ప్రవేశించే అవకాశం ఉంది. అక్కడ ఎలాంటి తనిఖీలు ఉండవు.. నేరుగా తాము వెళ్లాల్సిన విమానం వద్దకు ప్రభుత్వ వాహనంలో చేరుకోవచ్చు. ఈ పాస్‌పోర్ట్ కలిగిన ఉన్నవారు విదేశాలకు వెళ్లేటప్పుడు ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించే అత్యంత ముఖ్యులుగా గౌరవిస్తారు. 
Previous Post Next Post