40 రూపాయిలుకు చేరిన ధర
తిరుపతి, జూలై 4, (way2newstv.com)
చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌కు టమోటా ముంచెత్తింది. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దిగుబడి కొంతమేరకు తగ్గినా, టమోటా ధరలకు మూడురోజులుగా రెక్కలు వచ్చాయి. వారంరోజులుగా అక్కడక్కడా.. రెండురోజులుగా చిరుజల్లులు, వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో టమోటా పంటను రైతులు మార్కెట్‌కు తరలించారు.
మార్కెట్ లో టమోత
ఇక్కడినుంచి డిమాండ్ అధికంగా ఉన్న ఢిల్లీ, గోవా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, ఒడిశా, కేరళ, పాండిచ్చేరి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. మూడువారాలుగా మదనపల్లె మార్కెట్‌కు 1250 నుంచి 1500మెట్రిక్ టన్నుల టమోటాలు దిగుమతి అవుతున్నాయి. వ్యాపారులు పోటీ పడుతుండటంతో అనుకూలంగా టమోటా లభిస్తుండటంతో ధరలు కూడా రైతులకు అనుకూలంగా కొనసాగుతున్నాయి. రెండురోజుల వరకు రూ.6ల నుంచి రూ.8ల వరకు పలికిన టమోట, మంగళవారం మదనపల్లె మార్కెట్‌లో 14 నుంచి రూ.16లకు పలికింది. మొదటిరకం టమోటాలు తక్కువ ధరలు పలికినా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు మా అధికధరలకు కొనుగోలుకు మొగ్గుచూపారు. కాగా మూడువారాలుగా మదనపల్లె మార్కెట్‌కు 1250 నుంచి 1500మెట్రిక్ టన్నుల టమోటా దిగుమతి అవుతూ రికార్డు సృష్టిస్తోంది.