తెలంగాణ ఎస్ఐ పోస్టులకు ఇంటర్వ్యూలు

హైద్రాబాద్, జూలై 23 (way2newstv.com)
తెలంగాణలో ఎస్‌ఐ పరీక్ష ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులకు  సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ భవన ఆవరణలో ఉన్న ఐజీ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. 
తెలంగాణ ఎస్ఐ పోస్టులకు ఇంటర్వ్యూలు

అభ్యర్థులు ఎంపిక పత్రం, మెయిన్ పరీక్ష హాల్‌టికెట్, నాలుగు పాస్‌పోర్టు ఫొటోలు, విద్యార్హత సర్టిఫికేట్లు, అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను, మూడు జతల కాపీలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఐ పోస్టులకు సంబంధించి మొత్తం 1,272 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. 
Previous Post Next Post