విజయవాడ, జూలై 23 (way2newstv.com)
జలు తామిచ్చిన హామీలు నమ్మడం వల్లే ఓట్లేసి గెలిపించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. శాసనసభలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఆయన మాట్లాడారు. తమకు మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం రాదని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. తామిచ్చిన హామీలపై టీడీపీ సభ్యులకు క్లారిటీ కావాలంటే తాను ప్రజాసంకల్పయాత్రలో ఏం మాట్లాడాలో వినాలని జగన్ సూచించారు.
మంచి పేరు వస్తోందని టీడీపీ బాధ : జగన్
దీనికి సంబంధిచిన వీడియోను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అనుమతితో అసెంబ్లీలో ప్రదర్శించారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరిస్తే ప్రభుత్వానికి ఎక్కడ పేరొస్తుందోనని ప్రతిపక్షం ఆందోళన పడిపోతోందని అందుకే సభ సజావుగా జరగకుండా అడ్డుకుంటోందని జగన్ ఆరోపించారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బిల్లులు తీసుకొస్తుంటే అడ్డుకోవడం టీడీపీ తీరుకు నిదర్శనమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగానే వైఎస్సార్ చేయూత పథకాన్ని అమల్లోకి తెస్తున్నామన్నారు.
Tags:
Andrapradeshnews