విద్యార్థులకు ఉపయుక్తంగా స్టడీ సర్కిల్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విద్యార్థులకు ఉపయుక్తంగా స్టడీ సర్కిల్స్

వరంగల్, జూలై 11, (way2newstv.com)
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయితే చాలు నిరుద్యోగులంతా కోచింగ్ సెంటర్లకు పరుగులు తీసేవారు. వేలకు వేలు ఫీజులు చెల్లించి కడుపు మార్డుకుని రాత్రనక.. పగలనక పుస్తకాలతో కుస్తి పట్టేవారు. వేళకు తిండి ఉండదు.. సమయానికి నిద్ర ఉండదు... అయినా సరే జాబ్ గ్యారంటినా... అంటే అదీ లేదు... దీంతో మానసిక వత్తిడితో తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. నిరుద్యోగ యువతకు మేమున్నమంటు కొంతమంది ఎమ్మెల్యేలు, మరికొంతమంది నేతలు, మరికొన్ని ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చాయి. సమయానికి పౌష్టికాహరం అందిస్తు ఉచితంగా కోచింగ్ క్యాంప్ లను ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు భరోసా నింపి బాసటగా నిలిచేందుకు గతంలో ఎన్నడు లేని విదంగా  ప్రయ త్నాలు సాగుతున్నాయి. 
విద్యార్థులకు ఉపయుక్తంగా స్టడీ సర్కిల్స్

వేలకు వేలు పెట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని వారి కోసం ప్రభుత్వ సంస్థలైన బీసీ స్టడీ సర్కిల్స్, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, మైనారిటీ, ట్రైబల్ వేల్ఫేర్ సంస్థలు వారి వారి పరిధుల్లో శిక్షణనిస్తున్నాయి. పోలీస్ ఉద్యోగాలకు సన్న ద్ధమయ్యే వారి కోసం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుమార్గ్ ద్వారా యువతీ, యువకులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. ఇవే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు టీఆర్ఎస్ నేతలు వ్యయప్రయాసలను లెక్కచేయకుండా ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గతంలో అనేక మంది నిరుపేద నిరుద్యోగులు ఆయా సంస్థల్లో శిక్షణ తీసుకొని ఉద్యోగాలు సొంతం చేసుకున్న చరిత్ర ఉంది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ఏకకాలంలో వేలాది ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీ ద్వారా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయా సంస్థల ద్వారా నిరుపేద నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో తలనమునకలైంది. ఈ క్రమంలో సర్కార్ సంస్థలకు తోడు అనుబంధ సంస్థలు అనేకం ముందుకు వచ్చి వేలాదిగా విడుదల అయిన నోటిఫికేషన్లకు సన్నద్ధం అయ్యేవారికి తమ వంతు చేయూత అందించేందుకు ముందుకు వస్తోన్నాయి. ఈసారి కొత్తగా మునుపెన్నడూలేనివిధంగా నియోజకవర్గాల వారీగా ఉన్న నిరుద్యోగులను గుర్తించి వారికి సరైన విధంగా పోటీ పరీక్షలకు వెళ్లి జీవితంలో నిలదొక్కుకునేందుకు అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, పాల కుర్తి ఎమ్మెల్యే ఎర్రబెళ్లి దయాకర్ రావు, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తమ తమ ట్రస్ట్ లద్వారా పోలీస్, వీఆర్ఓ ఉద్యో గాలకు సన్నద్ధం అయ్యే వారికి ఉచిత శిక్షణను ఇప్పిస్తున్నారు. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు నిరుద్యోగ యువతి, యువకు లకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేయడంపై పలువురినుండి అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.ఇక నిరుపేద మహిళా అభ్యర్థులకు మడికొండలోని మహిళా ప్రాంగణంలో రాష్ట్ర మహిళా కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుండు సుధారాణి నేతృత్వంలో నిరుద్యోగ మహిళలకు వసతులతో కూడిన ఉచిత కోచింగ్ జరుగుతుంది. పాలనా పరమైన సంస్కరణల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలనే ధృడ సంకల్పానికి గడచిన నాలుగేళ్ల కాలంలో 39వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం అయింది. ఇప్పటికే ఆయా శాఖల్లో వేలాది ఉద్యోగాల భర్తీ జరిగినా ఇటీవలి కాలంలో దాదా పు 25వేల దాకా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఆయా ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారి కోసం నేరుగా ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసిన నేపథ్యంలో అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్, ఎర్రబెళ్లి ట్రస్ట్, పెద్ది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాలకు ఏర్పాటుచేసారు. మధ్యాహ్నబోజన వసతితోపాటు, పోలీస్ ఉద్యో గాలకు సన్నద్దమయ్యేవారికోసం కోడిగుడ్డు, అరటిపండును కూడా అందిస్తు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరితోపాటు రాష్ట్ర మహి ళా సహకార, ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్ గుండు సుధారాణి మీతో-మేము ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. వివిధ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించారు. 250 మంది మహిళల్ని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసి దాదాపు రెండు నెలలపాటు ఉచిత భోజనంతో వసతి ఏర్పాటు చేశారు.