దేశ రక్షణలో సైనికులకు ఫ్రి హ్యండ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దేశ రక్షణలో సైనికులకు ఫ్రి హ్యండ్

హైదరాబాద్, జూలై  27, (way2newstv.com)
సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ 81 వ ఆవిర్భావ దినోత్సవాన్ని చాంద్రాయణగుట్ట లోని సీఆర్పిఎష్ క్యాంపస్ లో  ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర హోమ్ శాఖ సహాయ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  పుల్వామా  లో అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్బంగ సీఆర్పీఎఫ్  జవానులు కవాతు నిర్వహించారు. తరువాత జరిగిన  రక్త దాన శిబిరం లో జవానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
దేశ రక్షణలో సైనికులకు ఫ్రి హ్యండ్

కార్యక్రమంలో భాగంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవానులు కుడా పాల్గోన్నారు. కేంద్ర మంత్రి  మాట్లాడుతూ ప్రతి సారి ప్రత్యర్థి దేశాలు దాడి జరిపినప్పుడు మన దేశం శాంతిగా వ్యవరించింది కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మన సైనికులకు ఫ్రీ హాండ్ అంటే వారి జవాబుకు ప్రతి జవాబు ఇస్తున్నామని అన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లో 13 ప్లాటూన్స్  ఉన్నాయి. అందులో మహిళల విభాగం ఉండటం విశేషం.  అలాగే సైనికుల కు వారి కుటుంబ సభ్యులకు ఈ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ సమస్యలకు సంబంధించి చర్చ జరిగింది త్వరలో వివరాలు విడుదల అవుతాయాని అన్నారు.  కేంద్ర హోం మంత్రి  అమిత్ షా,  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తరఫున తాను సీఆర్పిఎఫ్ కు రావటం  ఎంతో గర్వంగా ఉందని అయన అన్నారు.