నాయీ బ్రాహ్మణులు.. చంద్రబాబు తోక కట్ చేశారుః మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నాయీ బ్రాహ్మణులు.. చంద్రబాబు తోక కట్ చేశారుః మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్


అమరావతి, లైజూ 2, (way2newstv.com)
 గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయీ బ్రాహ్మణులను ఘోరంగా అవమానించారు.  అందుకే నాయీ బ్రాహ్మణులంతా కలిసికట్టుగా.. చంద్రబాబు తోకలు కట్ చేశారని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి    శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి జగన్  ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అయన అన్నారు. మంగళవారం నాడు  రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణుల సమస్యలపై విజయవాడలోని వైయస్ఆర్సీపి రాష్ట్ర కార్యాలయంలో నాయీ బ్రాహ్మణుల రాష్ట్రస్థాయి అవగాహనా సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి తో పాటు  వైయస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ  జంగా కృష్ణమూర్తి , ఎమ్మెల్యే  మల్లాది విష్ణు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ  నాయీ బ్రాహ్మణుల సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరిస్తోంది.

నాయీ బ్రాహ్మణులు.. చంద్రబాబు తోక కట్ చేశారుః మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీ మేరకు రూ. 10 వేలు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  నాయీ బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించి.. వారి కోర్కెలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్  సిద్ధంగా ఉన్నారని అన్నారు. శ్రీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ - బీసీల అభ్యున్నతి కోసం ఏలూరులో సభ పెట్టి.. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ఏకైక పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ ఇటువంటి డిక్లరేషన్ ఏ పార్టీ ఇంతకముందెన్నడూ ఇవ్వలేదు. బీసీల సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ పాదయాత్రలో జగన్ గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగానే ఆయన పరిపాలన సాగుతోంది.  అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే ముఖ్యమంత్రి జగన్ గారు ప్రజలకు ఇచ్చిన హామీల్లో మెజార్టీ హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు