ఎస్ఐ పోస్టుల తుది ఫలితాలు విడుదల - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎస్ఐ పోస్టుల తుది ఫలితాలు విడుదల

హైదరాబాద్,  (way2newstv.com): 
ఎస్ఐ పరీక్షలకు సంబంధించి మొత్తం 53,633 మంది అభ్యర్థులు తుది పరీక్షలు రాయగా.. వీరిలో 39,079 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే అర్హతలు, రిజర్వేషన్లను అనుసరించి వీరి నుంచి 1272 మందిని తుది ఎంపిక చేసింది.
ఎస్ఐ పోస్టుల తుది ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎస్ఐ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) శనివారం (జులై 13) విడుదల చేసింది. ఎస్ఐ(సివిల్) లేదా తత్సమాన పోస్టులతోపాటు ఎస్ఐ(ఐటీ, కమ్యూనికేషన్), ఏఎస్ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) పోస్టులకు సంబంధించి మొత్తం 1,272 అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేసినట్లు బోర్డు తెలిపింది. వీటిలో సివిల్ 710, ఏఆర్ 275, టీఎస్ఎస్సీ 175, ఐటీఎస్సై 29, ఫింగర్ ఫ్రింట్ విభాగంలో 26 పోస్టులు భర్తీ అయ్యాయి. ఇందులో 992 పురుషులు, 280 మహిళలు ఉన్నారు.