స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాల బ‌లోపేతానికి చ‌ర్య‌లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాల బ‌లోపేతానికి చ‌ర్య‌లు

హైదరాబద్ జూలై 23 (way2newstv.com):
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఉన్న 45వేల స్వ‌యం స‌హాయక మ‌హిళా బృందాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని జీహెచ్ ఎంసీ కమిషనర్ దానకిషోర్ పేర్కొన్నారు. స్వ‌యం స‌హాయ‌క బృందాల మ‌హిళ‌ల్లో అధిక శాతం నిరుపేద‌లే ఉన్నార‌ని, వారిని ఆర్థికంగా, సామాజికంగా బ‌లోపేతం చేయ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు. 
స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాల బ‌లోపేతానికి చ‌ర్య‌లు

స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్‌, సాఫ్‌, షాన్‌దార్ హైద‌రాబాద్ కార్య‌క్ర‌మాల్లో ఈ మ‌హిళ‌ల‌ను చురుకుగా పాల్గొనేలా చేస్తున్నామ‌ని, ప్ర‌తి బుధ‌వారం నాడు ఒక్కో స‌ర్కిల్‌లో ఎస్‌.హెచ్‌.జి బృందాల‌ను స‌మావేశాలు నిర్వ‌హించి సంబంధిత కార్పొరేట‌ర్లు, డిప్యూటి క‌మిష‌న‌ర్లు ఆ స‌మావేశాల‌కు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రుకావాల‌ని దాన‌కిషోర్ సూచించారు. అవ‌స‌ర‌మైతే స్థానిక శాస‌న స‌భ్యులు కూడా ఆ స‌మావేశాల‌కు ఆహ్వానించాల‌ని పేర్కొన్నారు. సాఫ్, షాన్‌దార్ హైద‌రాబాద్ కార్య‌క్ర‌మాన్ని మొత్తం జీహెచ్ఎంసీ ప‌రిధికి విస్త‌రిస్తరించ‌నున్న‌ట్టు ఇందుకుగాను అనుమ‌తికై స్టాండింగ్ క‌మిటీలో ఆమోదం కూడా పొంద‌నున్న‌ట్టు క‌మిష‌న‌ర్ తెలిపారు.