అమిత్‌షాను కలిసిన మాజీ ఎంపీ వివేక్‌

న్యూఢిల్లీ జూలై 23 (way2newstv.com):
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ మంగళవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సచివాలయం కూల్చివేత నిర్ణయంపై అమిత్‌షాకు వివేక్ ఫిర్యాదు చేశారు.  
అమిత్‌షాను కలిసిన మాజీ ఎంపీ వివేక్‌

అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తోందంటూ వివేక్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వివేక్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఆయన అమిత్ షాను కలిశారని, వచ్చే నెలలో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Previous Post Next Post