అసెంబ్లీ ఫర్నిచర్ వినియోగించుకున్నాను

మాజీ స్పీకర్ కోడెల వివరణ
గుంటూరు ఆగస్టు 20 (way2newstv.com):
అసెంబ్లి ఫర్నిచర్ వ్యవహరం పై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మంగళవారం స్పందించారు. హైదరాబాద్ నుండి అసెంబ్లి ఫర్నిచర్ ను తరలిస్తుండగా సామాన్లు సర్దుబాటు చేసుకునే క్రమంలో కొంత ఫర్నిచర్ ను తాను వినియోగించుకున్నట్లు స్పష్టం చేసారు. 
 అసెంబ్లీ ఫర్నిచర్ వినియోగించుకున్నాను

గతంలో అనేక సార్లు అసెంబ్లి అధికారులకు లిఖిత పూర్వకంగా లేఖలు వ్రాసి, ఫర్నిచర్ ను తీసుకువెళ్ళాలని కోరానని అయన  వివరణ ఇచ్చారు. అసెంబ్లీ  కార్యాలయ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదని అయన అన్నారు. ఇప్పటికయినా అసెంబ్లి అధికారులు వస్తే ఫర్నిచర్ ను అప్పగిస్తాను. లేదంటే ఎంత ఖర్చు అయ్యిందో చెబితే చెల్లిస్తానని  కోడెల అన్నారు. 
Previous Post Next Post