శ్రీరెడ్డి...మారవా... అంటూ జనసైనికులు ట్రోల్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రీరెడ్డి...మారవా... అంటూ జనసైనికులు ట్రోల్

హైద్రాబాద్, ఆగస్టు 6, (way2newstv.com)
గువెలా వస్తుంది జంగం దేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడట’ వెనుకటికెవరో.. ప్రస్తుతం వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా తగువులంటే తెగ ముచ్చటపడుతోంది. అందులోనూ జనసేన అధినేత, వపర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోనూ.. ఆయన ఫ్యాన్స్‌తో తగువు అంటే చెవి కోసుకుంటోంది. మరోసారి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ఒక వైపు సినిమాలు వదిలేసి.. తనకున్న పాపులారిటీతో పార్టీ పెట్టేసిన పవన్ కళ్యాణ్‌కి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార, ప్రతిపక్షాలను చావుదెబ్బ కొడతా.. ఆ పార్టీలకు అడ్రస్ లేకుండా చేస్తా అని శపథం చేసి ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ సింగిల్ డిజిట్‌తో సరిపెట్టేశారు. 175 స్థానాల్లో పోటీచేస్తే.. కేవలం ఒకే ఒక్క స్థానం (రాజోలు-రాపాక వరప్రసాద్) మాత్రమే గెలిచారు. 
 శ్రీరెడ్డి...మారవా... అంటూ జనసైనికులు ట్రోల్

పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజక వర్గాల్లో (భీమవరం, గాజువాక) ఘోర పరాజయం చవిచూశారు. ఇక ఓటమి భారంలో ఉన్న పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో విక్టరీ కొట్టేందుకు వ్యూహరచనలో ఉంటూనే అధికార పార్టీపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘ప్రభుత్వానికి 100 రోజుల టైం ఇస్తున్నా.. ఆ తరువాత నా ప్రతాపం’ చూపిస్తా అంటూ ప్రభుత్వానికి లేఖ రాసిన పవన్ కళ్యాణ్.. భవన కార్మికుల కష్టాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. పాలన సరిగా లేకపోతే నిలదీస్తాం, ప్రశ్నిస్తాం, పోరాడతామంటున్న పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది శ్రీరెడ్డి. జగన్ కాని.. ఆయన ప్రభుత్వాన్ని కాని చిన్న మాట అంటే తంతెత్తున్న లేస్తున్న శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ‘కనీసం అసెంబ్లీలో కూర్చోటానికి సీటు లేదు నీ మొఖానికి పిచ్చి కళ్యాణ్.. నీకు నాకు పెద్ద పని లేదు కాని.. దా కూర్చొని సొల్లు చెప్పుకుందాం’ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమె వ్యాఖ్యలపై అదే రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు జనసైనికులు. బూతులు తిడుతూ ‘ఛీ’రెడ్డి నువ్ ఇంక మారావా? అంటుంటే.. బాగా చెప్పారు శ్రీరెడ్డి అంటూ ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు మరికొంత మంది.