బ్యాటింగ్ బౌలింగ్ లలో చెలరేగిపోతున్న యువ భారత్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బ్యాటింగ్ బౌలింగ్ లలో చెలరేగిపోతున్న యువ భారత్

ముంబై, ఆగస్టు 7, (way2newstv.com)
టీం ఇండియా లో ఇప్పుడు ఏ మాత్రం రాణించకపోయినా ప్లేస్ గోవిందే. తమ గత చరిత్ర ఎంత వున్నది అన్నది కాదు ఇప్పుడెలా ఆడుతున్నారు అన్నది వారి రాత నిర్ణయం చేసేలా వుంది. దాంతో టీం ఇండియా లో తమ స్థానం సుస్థిరం అని సీనియర్లలో ధీమా లేదు. దీనికి ఎవరు మినహాయింపు ఏమి కాదని మిస్టర్ కూల్ ధోని నుంచి అందరికి ఇదే దడ పట్టుకుంది. కసిమీద వున్న యువకెరటాలు రాణిస్తున్న తీరు ఒకపక్క అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంటే మరోపక్క సీనియర్ లకు మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక కెప్టెన్సీ అంశంలోనూ ఇదే పోటీని స్వయంగా కోహ్లీ సైతం ఎదుర్కొంటు ఉండటం విశేషం.తాజాగా వెస్ట్ ఇండీస్ లో జరుగుతున్న టూర్ లో కుర్రోళ్ళు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో యువకెరటాలు దీపక్ చాహర్, సైనీ బ్యాటింగ్ లో రిషబ్ అద్భుతంగా రాణిస్తున్నారు. టీట్వంటీ సిరీస్ ను క్లిన్ స్వీప్ చేయడం వెనుక వీరందరి సమిష్టి కృషి దాగివుంది.
బ్యాటింగ్ బౌలింగ్ లలో చెలరేగిపోతున్న యువ భారత్

మరోపక్క బ్యాటింగ్ లో మాత్రం టీం ఇండియా ఇంకా అత్యధికంగా రోహిత్, కోహ్లీ పైనే ఆధారపడుతుంది. మిడిల్ ఆర్డర్ లో రిషబ్ దూకుడు మీద వున్నా ఇంకా స్థాయికి తగ్గ ఆటతీరును కొందరు అందిపుచ్చుకోవడంలేదు. కెప్టెన్సీ నుంచి ఏ ఒక్క సిరీస్ నుంచి తప్పుకున్నా తన ఆధిపత్యానికి గండిపడిపోతుందని విశ్రాంతి తీసుకోవాలిసిన కోహ్లీ కూడా వెస్ట్ ఇండీస్ టూర్ కి రెడీ అయిపోయాడంటే టీం లో కాంపిటేషన్ ఏ స్థాయిలో ఉందో తెలిసివస్తుంది.వచ్చే ఏడాది టి ట్వంటీ ప్రపంచ కప్ పై బిసిసిఐ గట్టిగానే దృష్టి పెట్టింది. టాలెంట్ హంట్ లో భాగంగా దేశంలోని యువ క్రికెటర్లను వరుసగా కీలకమైన టూర్లకు ఎంపిక చేసి వారికి అవకాశం కల్పిస్తుంది. వీరిలో అత్యుత్తమం గా రాణించేవారిని గుర్తించి టి ట్వంటీ వరల్డ్ కప్ ను దక్కించుకోవాలన్నది బిసిసిఐ వ్యూహం. వన్డే ప్రపంచ కప్ లో సెమిస్ వరకు వెళ్ళి నిరాశపరచడంతో వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో బోర్డు గట్టి చర్యల కు కసరత్తు మొదలు పెట్టింది. దీనికి తోడు తొలిసారి నిర్వహిస్తున్న టెస్ట్ సిరీస్ ప్రపంచ కప్ లోను టీం ఇండియా సత్తా చాటాలంటే ఈ చర్యలన్నీ తప్పవు మరి. దాంతో జట్టులో ఎవరి స్థానం ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో ఎవ్వరు చెప్పలేరు.