ఏపీలో ప్రణాళికా బోర్డు రద్దు! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో ప్రణాళికా బోర్డు రద్దు!

జగన్ సర్కారు సంచలన నిర్ణయం..
అమరావతి ఆగష్టు 22 (way2newstv.com)  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రణాళికా బోర్డును రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రణాళికా బోర్డు స్థానంలో నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు ఆయా ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి కోసం పనిచేయనున్నాయి.
ఏపీలో ప్రణాళికా బోర్డు రద్దు!

ఆర్థికవనరుల కేటాయింపు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం, నీటి నిర్వహణ, అసమానతల తగ్గింపుపై ఈ బోర్డులు దృష్టి సారిస్తాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ బోర్డులో చైర్మన్ తో పాటు సభ్యులు ఉంటారు. చైర్మన్ ను మూడేళ్ల కాలానికి నియమిస్తారు. ఈ బోర్డులు విజయనగరం(విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం), కాకినాడ (ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా), గుంటూరు(గుంటూరు, ప్రకాశం, నెల్లూరు), కడప(కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు) కేంద్రంగా పనిచేయనున్నాయి.