సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన జగన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన జగన్

విజయవాడ, ఆగస్టు 27  (way2newstv.com)
సంక్షేమ పథకాలు అమలుకు సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వచ్చే నెల నుంచి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబరు చివరి వారంలో సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకుంటున్న వారికి రూ. 10వేలకు ఇవ్వబోతున్నట్లు సీఎం చెప్పారు. దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను ప్రారంభించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే ఏ డబ్బు అయినా పాత అప్పులకు జమ కాకుండా అన్‌ ఇన్‌కంబర్డ్‌ బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేయించాలని సూచించారు. అకౌంట్లకు సంబంధించి బ్యాంకర్లతో ఉన్నతస్థాయిలో మాట్లాడుతున్నట్లు సీఎం తెలిపారు. లబ్ధిదారులను ఎంపిక చేయడమే కాకుండా, వాలంటీర్లు ఈ బ్యాంకు ఖాతాలను తెరవడంపై దృష్టిపెట్టాలన్నారు. 
 సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన జగన్

డబ్బు జమ కాగానే ఆ రశీదులను లబ్ధిదారులకు అందజేయాలన్నారు. బ్యాంకు అకౌంట్లనను తెరవడానికి కలెక్టర్లు కూడా బ్యాంకర్లతో సమావేశం కావాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకు రమ్మని సూచించారు. ప్రభుత్వ పథకం నుంచి అందే ఏ డబ్బు అయినా లబ్ధిదారులకే నేరుగా చేరాలని కేంద్రం కూడా సూచిస్తోందని జగన్ ప్రస్తావించారు. ఇక అక్టోబరు 15న రైతు భరోసా పథకం ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రైతు భరోసా కౌలు రైతులకూ ఇస్తామని చెప్పాంమని.. దీనిపై రైతులకు, కౌలు రైతులను ఎడ్యుకేట్‌ చేయాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లదన్నారు. కౌలు పత్రం, కార్డు అన్నీ కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటాయని.. రైతులకు నష్టం లేకుండా ఎలాంటి మేలు జరుగుతుందున్న విషయంపై అవగాహన కల్పించాలన్నారు. నవంబర్‌ 21న ప్రపంచ మత్స్య దినోత్సవం నిర్వహిస్తామని.. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు సంతృప్తికర స్థాయిలో పడవలు ఉన్నా, బోట్లు ఉన్నా రూ.10వేల చొప్పున ఇవ్వబోతున్నామన్నారు. వేట నిషేధ సమయం జూన్‌లో ముగిసినా.. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఇవ్వబోతున్నట్లు చెప్పారు. డీజిల్ పట్టించేటప్పుడే వారికి సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీజిల్ కోసం కొన్ని బంకుల్ని ఎంపిక చేయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం లీటర్‌పై రూ.6 సబ్సిడీ ఇస్తున్నామని.. దీన్ని రూ.9కు పెంచబోతున్నట్లు చెప్పారు. నవంబర్‌ 21న ఈ పథకం అమలు చేస్తామన్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24వేలు ఇస్తామని చెప్పామని.. ఈ హామీని అమలు చేయబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ పథకం అమలుపైనా దృష్టి పెట్టాలని.. జనవరి 26న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకు వస్తున్నామన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, షాపులున్న టైలర్లకు, షాపులున్న రజకులకు రూ.10వేలు ఇస్తామన్నారు. ఫిబ్రవరి చివరి వారంలోనే వైఎస్సార్‌ పెళ్లి కానుకనూ అమల్లోకి తీసుకు వస్తామని.. ప్రస్తుతం ఉన్న మొత్తాన్ని పెంచి ళ్లికానుకను ఇస్తామన్నారు. మార్చి చివరి వారంలో ఆలయాల్లో ధూప,దీప నైవేద్యాలు.. మసీదులకు సంబంధించి ఇమామం, మౌజంలకు.. చర్చిలకు సంబంధించి పాస్టర్లకు కొన్ని హామీలు ఇచ్చామని.. మార్చి చివరి వారంలో ఈ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామన్నారు. మార్చి చివరి వారంలోనే ఉగాది వస్తుందని.. అప్పుడే 25 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని తెలిపారు