షేర్ ఖాన్ గా రాబోతున్న రామ్ చరణం

హైద్రాబాద్, ఆగస్టు 27 (way2newstv.com)
ఒక్కొక్కర్ని కాదు షేర్ ఖాన్ వందమందిని ఒకేసారి రమ్మను’.. మగధీర చిత్రంలోని ఈ డైలాగ్ రామ్ చరణ్‌‌ని పవర్ ఫుల్ నటుడ్ని చేసింది. ఈ చిత్రంలో షేర్ ఖాన్‌గా మెరిసిన శ్రీహరికి మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్.. షేర్‌ ఖాన్‌గా రాబోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సైరా’లో షేర్ ఖాన్‌గా నటించిబోతున్నారట రామ్ చరణ్. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌లో రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 
షేర్ ఖాన్ గా రాబోతున్న రామ్ చరణం 

ఇటీవల మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ‘సైరా’ టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా హైప్ తీసుకురావడానికి ఓ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు చిత్ర యూనిట్. టీజర్‌‌కు పవన్ వాయిస్‌ను ఉపయోగించగా.. బాలీవుడ్ నుండి అమితాబ్, కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి, శాండిల్ ఉడ్ నుండి కిచ్చా సుదీప్ ఇలా స్టార్ హీరోలందరినీ ‘సైరా’లో కీలకపాత్రల్లో నటింపజేశారు. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమాకి నిర్మాతగానే కాకుండా ‘సైరా’తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు సమాచారం. దీనిపై అఫీషియల్ ప్రకటన లేకపోయినప్పటికీ.. ‘సైరా’లో షేర్ ఖాన్‌గా రామ్ చరణ్ అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో మగధీర, బ్రూస్ లీ చిత్రాల్లో మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. మరి ‘సైరా’లో ‘షేర్ ఖాన్’గా కనిపిస్తారా? లేక ఇది పులిహోర వార్తేనే అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. 
Previous Post Next Post