అచ్చెన్నాయుడు ధర్మాన ఫ్రెండ్ షిప్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అచ్చెన్నాయుడు ధర్మాన ఫ్రెండ్ షిప్

గుర్రుగా ఉన్న జగన్ 
శ్రీకాకుళం, ఆగస్టు 28 (way2newstv.com)
నిజంగా ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళంలో తాజా రాజకీయ పరిణామాలను కనుక గమనిస్తే ధర్మాన కృష్ణదాస్ విషయంలో సీరియస్ అవుతారనే చెప్పాలి. అయిదేళ్ల పాటు అసెంబ్లీలో జగన్ ని నానా మాటలు అనడమే కాదు, తాజా సభలో కూడా జగన్ మీద విపక్షం నుంచి గట్టి బాణాలు వేస్తున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో చెట్టాపట్టాల్ వేయడం అంటే జగన్ మెచ్చని.. నచ్చని విషయమే. తాజాగా టెక్కలిలో జరిగిన ఓ ప్రారంభోత్సవంలో బాబాయ్ అచ్చెన్న, అబ్బాయి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు హడావుడి చేస్తే వెనకన నిలబడి చూస్తున్న మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాటిని చూసిన వారు ధర్మాన కృష్ణదాస్ మంత్రినా, లేక అచ్చెన్న మంత్రినా అన్న చర్చ కూడా చేస్తున్నారు.
అచ్చెన్నాయుడు  ధర్మాన ఫ్రెండ్ షిప్

శ్రీకాకుళం జిల్లాలో కొన్ని చోట్ల కింజరపు కుటుంబం పట్టు గట్టిగానే ఉంది. ఎర్రన్నాయుడు కాలం నుంచి అది సాగుతోంది. దానికి అడ్డుకట్ట వేయాల్సిన వారు లోపాయికారిగా వ్యవహరించడంతో అక్కడ పార్టీలు ఉండవు. దానికి రుజువు చేసే ఘటన తాజాగా జరిగింది. ఏపీ అంతా వైసీపీ గాలి వీచిన టెక్కలిలో గెలిచిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తన ప్రాంతంలో మంత్రిని తానేనని నిరూపించుకునే ఘటన అది. అచ్చెన్నాయుడు నియోజకవర్గమైన టెక్కలిలోని కోటబొమ్మాళి మండలం లక్ష్మీపురంలో సౌడెం ఎత్తిపోతల పథకాన్ని తాజాగ ప్రారంభించగా ఆ కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే హోదాలో అచ్చెన్నాయుడు.. ఎంపీ హోదాలో కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఇక్కడ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ ఉండగానే మాజీ మంత్రి ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించడం విశేషం. పైగా బాబాయ్, అబ్బాయి ముందు వరసలో ఉంటూ ఫోజులు కొడుతూంటే వెనకన మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిలబడడం. దీనిని రామ్మోహన్ నాయుడు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి మరీ తన బాబాయ్ ప్రారభించిన పధకం అంటూ రాసుకున్నారు. ఆ విధంగా బాబాయి, అబ్బాయి తమ పట్టుని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేస్తూంటే అదే సందర్భంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరువు కూడా గంగలో కలిసిపోయింది.తాను ఎలాగైనా శ్రీకాకుళంలో గెలవాలి, అదే విధంగా టెక్కలిలో అచ్చెన్న గెలవాలి, ఈ లోపాయికారి అవగాహనతో ధర్మాన ప్రసాదరావు పనిచేయడం వల్లనే టెక్కలి సీటు పోయిందని జగన్ కి ఫిర్యాదులు వెల్లువలా వెళ్లాయి. స్వయంగా టెక్కలి వైసీపీ అభ్యర్ధి పేరాడ తిలక్ కూడా జగన్ కి తన బాధను, వెన్నుపోటుని తెలియచేసుకున్నారు. అన్ని ఆధారాలు పక్కాగా పరిశీలించాకే జగన్ ప్రసాదరావుకు మంత్రి పదవి ఇవ్వలేదని అంటారు. మరి అన్న ధర్మాన కృష్ణదాస్ ని మంత్రిని చేసినా కూడా ఆయన సైతం కింజరపు కుటుంబం వెంక నిలబడి మొహమాటాలకు పోతూంటే జగన్ చూస్తూ వూరుకుంటారా. ఇక టెక్కలిలో వైసీపీ నేతలు సైతం దీని మీద ఆగ్రహంగా ఉన్నారట. అచ్చెన్నను ఎలాగైనా ఓడించాలని జగన్ ఆదెశాలు ఇస్తే అది చేయకపోగా మంత్రిగా అవకాశం ఇచ్చినా మాజీ మంత్రి పట్టుని పెంచే విధంగా చేస్తున్న ధర్మాన కుటుంబంపై ఇపుడు జగన్ ఏ రకమైన చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరమైన చర్చగా జిల్లాలో ఉంది.