పిడుగురాళ్లలో పాములతో సహవాసం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పిడుగురాళ్లలో పాములతో సహవాసం

గుంటూరు, ఆగస్టు 28, (way2newstv.com)
పట్టణానికి చివరిగా ఉండటమో, అధికారులు శీతకన్ను వేయడమో తెలియదు కానీ ఆ ప్రాంత వాసులు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయారు. చీకటి పడితే చాలు దీపాల వెలుగులో నిత్యం పాములతో సహవాసం చేయాల్సిన పరిస్ధితి. ఒక్క సిసి రోడ్డు కూడా లేకపోవడంతో వర్షకాల సమయంలో వీధులలో నడిచేందుకు ఇబ్బందిగా ఉందని వీధుల నిండా కొండ రాళ్ళు ఉన్నాయని కనీసం వాటిని సరిచేయాలని అధికారులకు ఎన్ని సార్లు మెరపెట్టుకున్నా ఉపయెగం లేకుండా పోయిందని కాలనీ వాసులు వాపోతున్నారు. గత సంవత్సరం క్రితం వీధి దీపాలు వేసినప్పటకి అవి కూడా మూడు లేదా నాలుగు నెలలు పని చేశాయని మళ్ళీ అంధకారంలో ఉండాల్సిన పరిస్ధితి నెలకొందని ఆవేదన వ్యక్త చేస్తున్నారు. 
                     పిడుగురాళ్లలో పాములతో సహవాసం                                                                                                                
రాత్రి సమయాల్లో కొండ ప్రాంతం కావటంతో పెద్ద పెద్ద సర్పాలు విష జీవులు ఇండ్లలోకి వస్తున్నాయిని తెలుపుతున్నారు. పిడుగురాళ్ళ పట్టణంలోని 5, 11వార్డులలో భాగంగా ఉన్న సుందరయ్య కాలనీలో సుమారు 200 కుటుంబాలు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సున్నం పరిశ్రమలో పనిచేసే కార్మికులే. పది సంవత్సరాల క్రితం సిపిఎం ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నామని, పది సంవత్సరాలుగా పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగిన తమకు న్యాయం జరగలేదని వారు చెబుతున్నారు. ఎన్నికల వేళ పట్టాలు ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చిన నాయుకులు ఇప్పుడు పత్తా లేకుండా పోయా రు. సేవా సంస్ధల పుణ్యామా అని బోరు పంపు లు ద్వారా నీటి సరఫ రా జరుగు తున్నా వేసవి సమయంలో మాత్రం బోరు పంపులు ఎండిపోయి నీటి సమస్య తీవ్రతరం అవుతుందని తెలుపుతున్నారు. కనీసం అంగన్‌వాడీ, వైద్య సదుపాయం కూడా లేకపోవడం వల్ల గర్భిణులకు, చిన్న పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం సకాలంలో ఆందడంలేదని చెబుతున్నారు. రెండు రోజుల కిందట నా మనవడు ఇంటి బయట ఆడుకుంటుండగా పాము కనబటంతో భయపడి ఏడుస్తున్నాడు. ఇంటిలో నుండి బయటకు రాగా పెద్ద పాము ఆరుబయట ఉండటం చూసి పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొ రుగు వచ్చి దానిని తరిమి వేశారు. పాముని చూసి భయపడటంతో నా మనవడుకి జ్వరం వచ్చింది. ఇలా పాములు నిత్యం ఈ ప్రాంతంలో తిరుగుతు ంటాయి. రాత్రిళ్ళు అయితే మరింత దారుణంగా ఉంటుంది