కోడెలతో టీడీపీ పరువు గంగపాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కోడెలతో టీడీపీ పరువు గంగపాలు

గుంటూరు, ఆగస్టు 28, (way2newstv.com)
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యవహారశైలితో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరువు పోయింది. మరీ నిర్లజ్జగా కోడెల కుటుంబం చేసిన వ్యవహారం ఫర్నీచర్ ను ఎత్తుకెళ్లడం. దీనిపై అధికారులు విచారణకు దిగినా, నానా రాద్ధాంతం అవుతున్నప్పటికీ దీనిపై తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం పెదవి విప్పడం లేదు. కోడెల వ్యవహారాన్ని చంద్రబాబు ఎందుకు నాన్ సీరియస్ గా తీసుకున్నారనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.నిజానికి కోడెల శివప్రసాద్ పై కొద్దిరోజుల ముందు వరకూ కొద్దో గొప్పో గౌరవం ఉండేది. కష్టకాలంలోనూ పార్టీ జెండాను వీడకుండా ఉన్న కోడెల శివప్రసాద్ ను అభిమానించే వారు కూడా ఇప్పుడు చూస్తున్న సంఘటనలు చూసి అవాక్కవుతున్నారు. 
కోడెలతో టీడీపీ పరువు గంగపాలు

అసహ్యించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కి వినియోగించాల్సిన ఫర్నీచర్ ను కోడెల తన క్యాంపు కార్యాలయానికి తరలించడమే కాకుండా, గుంటూరులోని కోడెల శివప్రసాద్ కుమారుడికి చెందిన ఒక మోటారు కంపెనీలో కూడా ఈ ఫర్నీచర్ ఉన్నట్లు అధికారులు కనుగొనడం వివాదాస్పదమయింది.తాజాగా స్కిల్ డెవెలెప్ మెంట్ సెంటర్ నుంచి కూడా కోడెల కుటుంబ సభ్యులు కంప్యూటర్లు ఎత్తుకెళ్లినట్లు కేసు నమోదయినట్లు తెలుస్తోంది. ఇలా కోడెల కుటుంబం వరసగా వివాదాల్లో చిక్కుకుంటుంది. కోడెల శివప్రసాద్ ఇస్తున్న వివరణ సమర్థీనీయంగా లేదు. అసెంబ్లీలో భద్రతలేని కారణంగానే తాను క్యాంప్ ఆఫీస్ కు ఫర్నీచర్ తరలించానని చెప్పడం అర్థరహితం. కోడెల శివప్రసాద్ తనకు మూడు క్యాంపు కార్యాలయాలు ఉన్నాయని చెప్పడం కూడా విమర్శలకు తావిచ్చేలా ఉంది. నరసరాపుపేట, గుంటూరు, హైదరాబాద్ లలో తనకు క్యాంపు కార్యాలయాలు ఉన్నాయని కోడెల శివప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే.ఇక కోడెలపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పటీకి తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనకు అండగా నిలబడేందుకు ఇష్టపడటం లేదు. గుంటూరు జిల్లాలోని కోడెల సొంత సామాజిక వర్గం వారే ఎక్కువగా కేసులు పెడుతుండటం కూడా ఇందుకు ఒక కారణంగా చెప్పొచ్చు. మరో కారణం కోడెల శివప్రసాద్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చంద్రబాబు సయితం పార్టీ నేతల అంతర్గత సమావేశంలో అన్నట్లు తెలిసింది. అందుకే కోడెల శివప్రసాద్ వ్యవహారాన్ని చూసీ చూడనట్లు వదిలేయడమే మంచిదని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పడంతోనే వారు జోక్యం చేసుకోవడం లేదు. మొత్తం మీద కోడెల పార్టీలో ఒంటరివారయ్యారన్నది వాస్తవం.