రివర్స్ టెండరింగ్ పై ‘నవయుగ’ పిటిషన్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రివర్స్ టెండరింగ్ పై ‘నవయుగ’ పిటిషన్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు

విజయవాడ, ఆగస్టు 20 (way2newstv.com)
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం కుదిర్చిన టెండర్లను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ ను సవాల్ చేస్తూ నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ‘నవయుగ’ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. 
రివర్స్ టెండరింగ్ పై ‘నవయుగ’ పిటిషన్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు

ఎటువంటి నిబంధనలను తాము ఉల్లంఘించలేదని, ఎలాంటి కారణం చూపించకుండా తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఎలా రద్దు చేస్తారని నవయుగ కంపెనీ తరఫు న్యాయవాది జి.సుబ్బారావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది తమ వాదన వినిపించారు. నిజానికి నవయుగ కంపెనీ ఆర్బిట్రేషన్ కు వెళ్లాలే తప్ప హైకోర్టును ఆశ్రయించడం సరికాదని అన్నారు. రివర్స్ టెండరింగ్ కొనసాగించేందుకు తమకు అవకాశం కల్పించాలని కోరారు.