సీఎం జగన్ అభినందన సభ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీఎం జగన్ అభినందన సభ

ఏలూరు, ఆగష్టు 20 (way2newstv.com)
ఎఐటిసిసి జయశాలి చారిటబుల్ ట్రస్ట్ దాత్రి  సంయుక్తంగా నిర్వహిస్తున్న అబినందనసభలో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్దితోపాటు పలువురు ప్రముఖులకు అభినందనసభ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు.స్థానిక మంత్రి కేంపు కార్యాలయంలో మంగళవారం సంస్థ ప్రతినిధులు  
 సీఎం జగన్ అభినందన సభ

ఆళ్ల నానిని కలిసి ఈనెల 26వ తేది సాయంత్రం 6 గంటలకు విజయవాడ కానూరులోని అన్నెవారి ఫంక్షన్ హాలులో రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్దికి అభినందన సభ నిర్వహిస్తున్నామని, ఈ సభలో పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు ఉపముఖ్యమంత్రులు పాల్గొంటారని ఈ సభకు హాజరుకావాలని వారు కోరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన  జగన్ మోహన్ రెడ్దికి అభినందనసభ నిర్వహిస్తున్నామని ఈ సభకు హాజరు కావాలని విశాఖపట్నం నుండి తమ ప్రతినిధులు అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఉపముఖ్యమంత్రులను కలుసుకుని ఆహ్వానపత్రాలు అందిస్తున్నామని చెప్పారు. దీనిపై  నాని స్పందిస్తూ ఈ సమావేశానికి తాను తప్పనిసరిగా హాజరవుతానని చెప్పారు.