ప్రతి ముస్లిం కుటుంబానికి ఉగాధినాటికల్లా ఇళ్లస్థలపట్టాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రతి ముస్లిం కుటుంబానికి ఉగాధినాటికల్లా ఇళ్లస్థలపట్టాలు

 ఏలూరు, ఆగష్టు 12 (way2newstv.com)
 అల్లాసాక్షిగా ప్రతి పేద ముస్లిం కుటుంబానికి ప్రభుత్వ పధకాలన్నీ అమలుచేసి తీరుతానని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) చెప్పారు. స్థానిక కర్బల్ మైదానంలో బక్రీద్ పండుగ సందర్భంగా ఏలూరు ఎంపి  కోటగిరి శ్రీధర్ తో కలిసి  నాని ప్రార్దనలు నిర్వహించారు. సమాజంలో కష్టపడి పనిచేస్తూ ఆర్థికంగా అభివృద్ది చెందని ఎన్నో పేద ముస్లిం కుటుంబాలను తాను చూసానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ముస్లిం కుటుంబానికి ఉగాధినాటికల్లా ఇళ్లస్థలపట్టాలు అందించి శాశ్వతగృహనిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటానని శ్రీ నాని చెప్పారు. ఎన్నికలముందు తనపాదయాత్రలో ముస్లింపేద కుటుంబాలు ఆర్దికంగా పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూశానని ప్రతిపేద కుటుంబం ఉన్నతస్థాయిలో అభివృద్ది సాధించాలన్నదే ముఖ్యమంత్రి  జగన్ లక్ష్యమని ఆయన చెప్పారు. 
ప్రతి ముస్లిం కుటుంబానికి ఉగాధినాటికల్లా ఇళ్లస్థలపట్టాలు

అమ్మఒడిపధకం క్రింద ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి 15 వేల రూపాయలు ఉచితంగా అందిస్తోందని పిల్లలందరినీ చదివించడానికి పేద ముస్లిం లు ముందుకురావాలని చదువువల్లమాత్రమే ప్రతికుటుంబం బాగు పడుతుందని అందుకే  జగన్ అమ్మఒడి పధకాన్ని అమలుచేయడానికి ముందుకు వచ్చారనిని చెప్పారు. సామాన్య జీవనం సాగించే ముస్లిం వర్గాలు తమ పిల్లలను చిన్నప్పుడే పనిలోపెట్టే అలవాటును విడనాడి చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సమాజంలో పేదవర్గాలు కూడా డాక్టర్లు, ఐఏఎస్ అధికారులు కావడానికి అవసరమైన ఆర్థిక చేయూతను ప్రభుత్వం కల్పిస్తోందని ఇటువంటి స్థితిలో చదువుకు ప్రాధాన్యత పెరిగిందని  నాని చెప్పారు. పేద ముస్లింలు ఆర్థిక ప్రగతి సాధించడానికి పెద్దఎత్తున ఋణసౌకర్యాన్ని కూడా కల్పించి జీవన స్డితిగతులను మెరుగుపరుస్తానిని  నాని చెప్పారు. పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తానిచ్చిన మాట నిలబెట్టుకుంటానని శ్రీ నాని చెప్పారు. ఎలూరు ఎంపి టగిరి శ్రీధర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ముస్లింలు ప్రాణత్యాగం చేశారని అటువంటి వారి త్యాగం ఈ దేశం ఎన్నటికీ మరువలేదని చెప్పారు. ఏలూరు నగరంలో ప్రప్రధమంగా తాను శ్రీ ఆళ్లనానితోకలిసి బక్రీద్ పండుగ వేడుకల్లో పాల్గొనడం తన అధృష్యంగా భావిస్తానని  శ్రీధర్ చెప్పారు. ముస్లింలు దేశభక్తులని దేశ స్వాతంత్ర్యం కోసం 99 వేల మంది ప్రజలు ప్రాణత్యాగం చేస్తే అందులో 66 వేల మంది కేవలం ముస్లింలేనని, త్యాగానికి ముస్లింలు మారుపేరని  శ్రీధర్ చెప్పారు. ఎంఎల్‌సి  రాము సూర్యారావు మాట్లాడుతూ అల్లా బోధించిన మార్గంలో ప్రతిఒక్కరూ ముందడుగు వేస్తే పేదరికం లేని సమాజాన్ని స్థాపించగలుగుతారన్నారు. ఈ సందర్భంగా బక్రీద్ పండుగ విశిష్టతను ముస్లిం పెద్దలు వివరించారు. కో ఆప్షన్ మాజీ సభ్యులు శ్రీ ఎస్ఎంఆర్ పెదబాబు, వైఎస్ఆర్‌సిపి ఏలూరు నగర అద్యక్షులు బొద్దాని శ్రీనివాస్, నాయకులు మధ్యాహ్నపు బలరామ్, మంచెం మైబాబు,శ్రీనివాస్, మున్నులజాన్ గురునాద్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.