నల్గొండ ఆగస్టు,12 (way2newstv.com)
నాగార్జునసాగర్కు రికార్డ్ స్థాయిలో వరద నీరు చేరింది. వరద ప్రవాహంతో వేగంగా సాగర్ జలాశయం నిండుతుంది. సోమవారం ఉదయం సాగర్ గేట్లు అధికారులు ఎత్తివేసారు. 4 గేట్ల ద్వారా పులిచింతలకు నీటిని విడదల చేసారు.
సాగర్ లో రికార్డు స్థాయిలో వరద నీరు
ఇన్ఫ్లో 8 లక్షల 25 వేల క్యూసెక్కులు నీరుగా ఉంది. కుడి ఎడమ కాలువలు, విద్యుదుత్పత్తి ద్వారా 37 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 556 అడుగులుగా ఉంది. పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు, ప్రస్తుతం 223 టీఎంసీలు. సాగర్కు భారీగా వరద రావడం 2009 తర్వాత ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు.
Tags:
telangananews