హైద్రాబాద్, ఆగస్టు 24(way2newstv.com)
తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి చెందిన సన్నే శ్రీ హర్ష అనే విద్యార్థి లండన్ నగరంలో అదృశ్యమయ్యాడు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఉదయ్‌ప్రతాప్ కుమారుడైన శ్రీహర్ష లండన్‌లో పీజీ చదువుతున్నారు. రెండ్రోజులుగా శ్రీహర్ష నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన పడిన కుటుంబసభ్యులు అతడి స్నేహితులను సంప్రదించారు.
లండన్ లో ఖమ్మం విద్యార్ధి మిస్సింగ్
దీంతో వారు స్థానిక పోలీసులను సంప్రదించగా యువకుడి కోసం గాలింపు చేపట్టారు. లండన్‌లోని బీచ్‌హెడ్ అనే బీచ్ సమీపంలో శ్రీహర్షకు సంబంధించి ల్యాప్‌టాప్‌ను గుర్తించారు. దీంతో బీచ్ పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ల సాయంతో పోలీసులు గాలింపు చేపట్టారు. యువకుడి తండ్రి ఉదయ్ ప్రతాప్ కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. శ్రీహర్ష మిస్సింగ్ సమాచారం తెలియగానే బంధువులు, స్థానిక రాజకీయ నేతలు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఫోన్లో శ్రీహర్ష కుటుంబాన్ని పరామర్శించారు. ఎలాంటి ఆందోళన పడొద్దని సూచించారు.