హైదరాబాద్, ఆగష్టు 7 (way2newstv.com - Swamy Naidu)
టీఆర్ఎస్ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ వందరోజుల ప్రణాళిక ప్రకటించి 1200 రోజులైనా అతిగతీ లేదని పీసీసీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ విమర్శించారు.బుదవారం గాంధీ భవన్ లో మీడియా తో మాట్లాడుతూ కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించిన ఈ యాక్షన్ ప్లాన్ గాలికొదిలేశారన్నారు.హైదరాబాద్ లో రోడ్లపై గుంత చూపెడితే వెయ్యి రూపాయలు ఇస్తామని కేటీఆర్ అన్న విశ్యయాన్ని ఆయన గుర్తు చేసారు.గ్రేటర్ హైదరాబాద్ పాలనను సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
అతిగతీ లేని గ్రేటర్ హైదరాబాద్ వందరోజుల ప్రణాళిక
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య చాలా దారుణంగా ఉంది ..వర్షం పడితే ప్రజలు రోడ్లపై నరకం చూస్తున్నారని ఆవీదన వ్యక్తం చేసారు.కేసీఆర్ ను నమ్మి వంద స్థానాలు గ్రేటర్ లో కార్పొరేటర్లను గెలిపించారు .. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు.జిహెచ్ఎంసి వెబ్ సైట్ లో పూర్తిస్థాయి సమాచారం పెట్టడం లేదన్నారు.ఇంకా పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవడం కేసీఆర్ నియంతృత్వానికి నిదర్శనం మన్నారు.రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతున్నారని దుయ్యబట్టారు.2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చెయ్యాలని నిజముద్దిన్ డిమాండ్ చేసారు.
Tags:
telangananews