తెలంగాణ వీర,ధీర వనిత సుష్మాస్వరాజ్ హైదరాబాద్ లో సుష్మాస్వరాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలి

హైదరాబాద్ ఆగష్టు 7  (way2newstv.com - Swamy Naidu)
తెలంగాణ వీర,ధీర వనిత సుష్మాస్వరాజ్..అని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి  కొనియాడారు. బుదవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాటాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మాస్వరాజ్ కీలక పాత్ర పోషించారన్నారు.తెలంగాణ ప్రజలు చిన్నమ్మ గా పిలుచుకునే సుష్మాస్వరాజ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నా బిల్లు పాస్ అయ్యేందుకు సుష్మాస్వరాజ్ సహకరించారన్నారు.
 
హైదరాబాద్ లో సుష్మాస్వరాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలి 
సీఎం కేసీఆర్, కేటీఆర్ మాట్లాడిన తీరు చాలా బాధాకరమన్నారు.హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చెయ్యాలన్నప్పుఫు ఆమె తీవ్రంగా వ్యతిరేకించిందని తెలంగాణ కలను నెరవేర్చిన మహానేత సుష్మాస్వరాజ్ అని అన్నారు.తెలంగాణ ప్రజలు ఆమెకు రుణపడి ఉంటారన్నారు. హైదరాబాద్ లో సుష్మాస్వరాజ్ విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్ చొరవతీసుకోవాలని కోరారు. ఆమె ఆత్మశాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.
Previous Post Next Post