వరల్డ్ హెరిటేజ్ సిటీగా హైదరాబాద్–యునెస్కో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వరల్డ్ హెరిటేజ్ సిటీగా హైదరాబాద్–యునెస్కో

హైదరాబాద్ ఆగష్టు 23 (way2newstv.com)
ద్బుతమైన చారిత్రక, సంస్కృతిక వారసత్వ సంపద, ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడాలున్న హైదరాబాద్ నగరాన్ని హెరిటేజ్ సిటీగా ప్రకటించేందకు కృషి ప్రయత్నించనున్నట్టు యునెస్కో హెరిటేజ్, కల్చర్ విభాగం ప్రతినిధి జెస్సీహాన్ పేర్కొన్నారు. నేడు సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో జరిగిన జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్న సమావేశానికి జెస్సీహాన్ ప్రత్యేకంగా హాజరై నగరంలో చారిత్రక కట్టడాల పరిరక్షణ, పర్యాటకులకు కావాల్సిన సౌకర్యాలు, ప్రముఖ చారిత్రక పర్యాటక ప్రాంతాల్లో కల్పించాల్సిన కనీస సౌకర్యాలు తదితర అంశాలపై ప్రసంగించారు. 
వరల్డ్ హెరిటేజ్ సిటీగా హైదరాబాద్–యునెస్కో 

నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ ఎం.దానకిషోర్ లు కూడా ఉన్న ఈ సమావేశంలో యునెస్కో ప్రతినిధి జెస్సీ హాన్ మాట్లాడుతూ  జైపూర్ నగరం మాదిరిగానే హైదరాబాద్ నగరానికి వరల్డ్ హెరిటేజ్ సిటీ ట్యాగ్ ను ప్రకటించేందుకు కావాల్సిన సాధ్యాఅసాధ్యాలను పరిశీలించేందుకై హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా పర్యటిస్తున్నట్టు తెలిపారు. ప్రతి హెరిటేజ్ సిటీకి తనదైన ప్రత్యేక జీవన విధాన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహర్యం, ఆచార వ్యవహారాలు ప్రత్యేకంగా ఉంటాయని, ఈ లక్షణాలన్ని 400 సంవత్సరాలకు పైగా ఉన్న హైదరాబాద్ సిటీకి ఉన్నాయని పేర్కొన్నారు. నగరంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాల పట్ల సిటీజన్ల భాగస్వామ్యం ముఖ్యంగా తమదైన ఇన్ వాల్వ్ మెంట్ అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ, మక్కా మసీద్ తదితర ప్రాంతాల్లో స్థానికుల ఎంగేజ్ మెంట్ విధిగా ఉండాలని పేర్కొన్నారు. గోల్కొండ, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ మరింత మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. హెరిటేజ్ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యాటకులకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించేందుకు జిహెచ్ఎంసి అత్యంత కీలక పాత్ర పోషించాలని ఆమె సూచించారు. మెగా సిటీగా రూపొందుతున్న హైదరాబాద్ నగరానికి పలు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని, వీటిని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు నగరవాసుల భాగస్వామ్యం అత్యంత ప్రాధాన్యమని అన్నారు. చారిత్రక వారసత్వ సంపదగా వచ్చిన కట్టడాలను పరిరక్షణ ఫండమెంటల్ డ్యూటిలో భాగమేనని అన్నారు. కొన్ని చారిత్రక కట్టడాలపై సందర్శకులు అనవసర రాతలను రాస్తున్నారని, వీటిని నివారించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ దేశంలో అత్యంత ప్రాచీన నాగరికత, వారసత్వ సంపద తెలంగాణ రాష్ట్రంలో ఉందని గుర్తుచేశారు. శాతవాహనులు, ఇక్ష్వాకుల ప్రాచీన కాలం నుండి కాకతీయలు, అసబ్ జాహీల వరకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని అన్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తేవడానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.  కాగా హైదరాబాద్ లో చారిత్రక, పర్యాటక స్థలాల్లో చేపట్టాల్సిన చర్యలపై మరింత చైతన్యం కలిగించేందుకు ప్రత్యేక వర్క్ షాప్ ను జిహెచ్ఎంసి అధికారులకు నిర్వహించాలని యునెస్కో ప్రతినిధి జెస్సీ హాన్ ను కమిషనర్ కోరారు. ఈ సందర్భంగా జెస్సి హాన్ ను నగర మేయర్ రామ్మోహన్, కమిషనర్ దానకిషోర్ లు పూలగుచ్చంతో సత్కరించారు.