శ్రావణ మాస పూజలతో పూజలందుకుంటున్న కోనేటి రాయుడు
వనపర్తి ఆగస్టు 03 (way2newstv.com)
భద్రాద్రి రాముని తలపించే విధంగా ఉన్న గోపాల్ పేట లోని శ్రీ కోదండ రాముని చూసి తరిద్దాం అంటూ అదిగో భద్రాద్రి ఇదిగో శ్రీరాముడు అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో పాడుతూ గోపాల్ పేట లోని రామ్ నగర్ కాలనీ వెలసిన శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి విచ్చేస్తున్నారు. శ్రావణమాసం అంటేనే భక్తులకు భక్తి పారవశ్య మైన రోజులు. శ్రావణ మాసంలో నెల రోజులపాటు ఒక్కొక్క రోజు ఒక్కో భక్తుడు తన ఇష్టదైవాన్ని భక్తిశ్రద్ధలతో, నియమ నిబంధనలతో, ఉపవాస దీక్ష తో పూజించడం వంటివి జరుగుతాయి.
భద్రాద్రి రాముని తలపించే గోపాల్ పేట శ్రీ కోదండ రాముడు
అదేవిధంగా గోపాల్పేట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కూడా శ్రావణ మాస పూజలు జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా ఆలయంలో వైభవంగా పూజలు నిర్వహించేందుకు పూజారులు సిద్ధంగా ఉన్నారు. శనివారం శ్రావణ శనివారం కావడం వల్ల ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలను పూజలు నిర్వహిస్తున్నారు ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడమే కాకుండా పూజలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆలయ అర్చకులు రంగాచార్యులు తెలిపారు. ఈ శ్రావణ మాసంలో ఐదు ప్రత్యేక శుక్రవారాలు, నాలుగు శనివారాలు, ఇంకా సోమవారాలు ఇలా అన్ని వారాలు ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తామని అర్చకులు రంగాచారి తెలిపారు. ఈ మాసం మొత్తం కూడాను ప్రతినిత్యం ఉష కాలంలోనే లేచి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి సేవించు కున్నట్లయితే ఆయన అనుగ్రహం తో ఆయురారోగ్యాలు, ధన సంపదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని అర్చకులు రంగాచారి తెలిపారు.
Tags:
News