జగన్ పై చంద్రబాబు ఫైర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ పై చంద్రబాబు ఫైర్

గుంటూరు, ఆగస్టు 9(way2newstv.com):
సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. నా అనుభవమంతా లేదు జగన్‌ వయసు. జగన్‌ సర్కార్‌ రద్దుల ప్రభుత్వంగా మారింది. పోలవరం కాంట్రాక్ట్‌ రద్దుచేశారు. అన్న క్యాంటీన్లు తొలగించారు. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను పూర్తిచేశాం. నా జ్ఞాపకాలు ఉండొద్దని అన్ని రద్దు చేస్తున్నారు. టీడీపీ హయాంలో వచ్చిన సీసీ రోడ్లు, మరుగుదొడ్లు కూడా తొలగిస్తారా? ఎందుకు ప్రజావేదిక కూల్చారు అని చంద్రబాబు ప్రశ్నించారు.
జగన్ పై చంద్రబాబు ఫైర్

పెన్షన్లపై వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రూ.200 పెన్షన్‌ రూ.2 వేలు చేశామని, రూ.200 పెంచుతూ విడతల వారీగా ఇస్తారంటా అని నిలదీశారు. వైసీపీ వస్తే ఏం జరుగుతుందో ఎన్నికల ముందే చెప్పామని, తాను చెప్పినట్టే జరుగుతోందన్నారు. పసుపు రంగు ఉందని అన్న క్యాంటీన్లను తొలగించారని దుయ్యబట్టారు. గిరిజన యువతుల కోసం పెళ్లి కానుక తీసుకొస్తే తొలగించారని, ఉద్యోగాలన్నీ తొలగించి వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. పన్నులు కట్టేది ప్రజలు.. అనుభవించేది వైసీపీ నేతలు అని చంద్రబాబు ధ్వజమెత్తారు.