మహానటికి అవార్డులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మహానటికి అవార్డులు

న్యూఢిల్లీ, ఆగస్టు 9 (way2newstv.com):
ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వివిధ కేటగిరీలతో భాగంగా శుక్రవారం నాడు ఈ అవార్డులను ప్రకటించగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక అయ్యింది. జాతీయ ఉత్తమ నటిగా కీర్తిసురేష్ (మహానటి), ఉత్తమ నటుడుగా తమిళ నటుడు ధనుష్ ఎంపికయ్యారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని విజేతలను ప్రకటించారు. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ‘మహానటి’ సినిమాకు జాతీయ పురస్కారం లభించింది. ఈ సినిమాలో ప్రధానపాత్ర పోషించిన కీర్తి సురేశ్‌ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. 
మహానటికి అవార్డులు

ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది. 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించారు. ఉతమ నటుడు అవార్డును ఆయుష్మాన్‌ ఖురానా, నిక్కీ కౌశల్‌లకు సంయుక్తంగా ప్రకటించారు.సాంకేతిక విభాగాల్లో ఈసారి తెలుగు సినిమాలకు ఎక్కువ పురస్కారాలు లభించాయి. హిందీలో ఉత్తమ చిత్రంగా అంధాధున్‌ ఎంపికైంది. పద్మావత్‌ చిత్రానికి సంగీతం అందించిన దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు దక్కించుకున్నారు.
66వ నేషనల్ అవార్డ్స్ విజేతల వివరాలు.. 
1. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): మహానటి 
2. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్: అ, కేజీఎఫ్ 
3. ఉత్తమ కథానాయిక: కీర్తి సురేష్ 
4. ఉత్తమ నటుడు: ధనుష్ 
5. ఉత్తమ మిక్స్డ్ ట్రాక్: రంగస్థలం 
6. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: అ 
7. ఉత్తమ యాక్షన్ చిత్రం: కేజీఎఫ్ 
8. బెస్ట్ లిరిక్స్: మంజుతా (నాతి చరామి) 
9. బెస్ట్ మ్యూజిక్: పద్మావతి 
10. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: చి.ల.సౌ