ముంపు గ్రామాల్లో ఇబ్బందులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముంపు గ్రామాల్లో ఇబ్బందులు

కాకినాడ ఆగష్టు 6 (way2newstv.com)
ప్రభుత్వం సకాలంలో సరైన చర్యలు తీసుకోకపోవడంతో ముంపుగ్రామలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప అన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో వరదలు వస్తాయని తెలిసికూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం  ప్రభుత్వం అసమర్ధత అని అన్నారు. 
 ముంపు గ్రామాల్లో ఇబ్బందులు

మంగళవారం అయన పార్టీ నేతలతో కలసి తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో పర్యటించారు. చిన్న రాజప్ప మాట్లాడుతూ పోలవరం స్పీల్వే నిర్మాణం వల్ల ముంపుకు గురవుతుంది అని వైసీపీ నాయకులు అనడం అవాస్తవమని అన్నారు. ప్రభుత్వం రీటెండరింగ్ విధానం వల్ల పోలవరం నిర్మాణం మరో మూడేళ్లు వెనక్కి వెళ్ళిపోతుందని అయన అన్నారు.