గ్రామాలకు..బడులకు పేర్లు పెడతాం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రామాలకు..బడులకు పేర్లు పెడతాం

విజయవాడ, ఆగస్టు 19 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రావాలని, అందుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మాట్లాడిన జగన్.. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రవాస ఆంధ్రులు అందరూ  తమ తమ గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు సీఎం జగన్.ఏపీలో ఉన్న ప్రభుత్వం అందరిది అని, ఎప్పుడొచ్చినా అందరికి తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఖండాలు దాటినా తెలుగు రాష్ట్రాల మీద చెక్కుచెదరని అభిమానం చూపిస్తున్న ప్రజలను చూస్తుంటే గర్వంగా ఉందని, కన్న తల్లిని, మాతృ భూమిని, మూలల్ని ఎంతలా గౌరవిస్తున్నారో అర్థం అవుతుందని అన్నారు జగన్. 
గ్రామాలకు..బడులకు పేర్లు పెడతాం

మా దేశానికి ఇండియన్‌ కమ్యూనిటీ ఎంతో సేవ చేస్తుందని అమెరికా అధ్యక్షులు అన్నప్పుడు చాలా గర్వంగా ఫీలవుతాం అని జగన్ చెప్పారు.  అమెరికాలోనే భారతీయులు 41 లక్షలు ఉంటే, అందులో  తెలుగువారు 4లక్షల మంది అని చెప్పారు జగన్. ఇదే సమయంలో ప్రవాస ఆంధ్రులు గ్రామాల్లో బడులు, హాస్పిటల్స్, బస్‌స్టాప్‌లు మార్చాలనే ఆరాటం ఉన్నవాళ్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు జగన్. మీ సహాయంతో వాటిని నిర్మించి వాటికి మీ పేరే పెడతామని అన్నారు జగన్. ఎన్నారైలకు అనుకూలంగా ఉండేందుకు ఓ ప్రభుత్వ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామని, అది సీఎం పేషీతో నేరుగా లింక్ అయ్యి ఉంటుందని చెప్పారు జగన్. ఏపీలో సీఎంగా ఉన్నది మీ అన్న.. మీ తమ్ముడు అని మర్చిపోకండి. మీకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను. మీ అందరి చల్లని దీవేనలు ఎల్లప్పుడు నాపై ఉంచండి అని కోరారు జగన్.