లైవ్ లో ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీమ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లైవ్ లో ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీమ్

న్యూఢిల్లీ, ఆగస్టు 19 (way2newstv.com)
ఉత్తరాదిని వరదలు ముంచెత్తున్నాయి. జమ్మూకశ్మీర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదలతో తావి నది పొంగి ప్రవహించింది. ప్రవాహం పెరగడంతో ఇద్దరు వ్యక్తులు వరదల్లో చిక్కుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగింది. హెలికాప్టర్ ద్వారా రెస్కూ ఆపరేషన్ నిర్వహించింది. ఆ ఇద్దరు వరద బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఆ తర్వాత రెస్కూ నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఒడ్డుకు చేరాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  ఒక్కరోజే హిమాచల్ ప్రదేశ్‌లో 25 మంది ప్రాణాలు కోల్పోగా తొమ్మిది మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. 
లైవ్ లో ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీమ్

అలాగే ఉత్తరాఖండ్‌లో వరదకు ఇళ్లు కొట్టుకు పోయి 18 మంది గల్లంతయ్యారు. ఈ రెండు రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడి జాతీయ రహదార్లు, జిల్లా రహదార్లు సైతం మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఆరు జాతీయ రహదార్లతోపాటు 325 రోడ్లను మూసివేశారు.హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో దీంతో నదులు,  కాలువలు ఉప్పొంగుతున్నాయి. భాక్రా నంగల్ ప్రాజెక్టులో వాటర్ లెవల్ రికార్డు స్థాయికి చేరింది. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాధారణ జనజీవనం స్తంబించింది.బియాస్ నది ఉద్ధృతికి కుల్లు సమీపంలోని ఓ వంతెన నీటిలో కొట్టుకుపోయింది. ఐదో నంబర్ జాతీయ రహదారి సహా పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. కులు మనాలిని కలిపే నేషనల్ హైవే పూర్తిగా పాడై పోయింది. దీంతో భారీ వాహనాల రాకపోకలను నిలిపేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో SDRF, రెడ్ క్రాస్, ITBP, NDRFబృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి