మనది ఒకే జెండా ఒకే చట్టం ఒకే దేశం.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మనది ఒకే జెండా ఒకే చట్టం ఒకే దేశం..

కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు బులెట్ పై "నారీ తిరంగా యాత్ర"
 మంద రాజ్యలక్ష్మికి ఘనంగా స్వాగతం పలికిన బిజెపి, విహెచ్ పి తదితర నేతలు 
 దద్దరిల్లిన వందేమాతరం, భారత్ మాతాకి జై నినాదం 
షాద్ నగర్ ఆగస్టు 23, (way2newstv.com)
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఒకే జెండా, ఒకే దేశం, ఒకే చట్టంతో అఖండ భారత దేశాన్ని నిర్మించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి బాసటగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు బులెట్ పై తిరంగా యాత్ర చేపట్టి సంఘీభావం తెలుపుతున్నట్టు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరుకు చెందిన మంద రాజ్యలక్ష్మి అన్నారు. ఆగస్టు 15న కన్యాకుమారి నుండి 21 మంది యువకులతో 5200 కిలోమీటర్లు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకుబయలుదేరిన తిరంగా యాత్ర ఈరోజు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చేరుకుందని అన్నారు. 
మనది ఒకే జెండా ఒకే చట్టం ఒకే దేశం..

లీగల్ ఫర్ రైట్స్ కౌన్సిల్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన మంద రాజ్యలక్ష్మి యాత్రకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విమోచన కమిటీ చైర్మన్ ఎన్. శ్రీవర్ధన్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ నేత బండారు రమేష్, సింగిల్ విండో చైర్మన్ పి. వెంకటేశ్వర రెడ్డి తదితర బిజెవైఎం తదితర అనుబంధ సంఘాల నుండి కార్యకర్తలు చౌరస్తాకు చేరుకుని రాజ్యలక్ష్మి యాత్రకు భారీ ఎత్తున స్వాగతం పలుకుతూ.. పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బి. అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజ్యలక్ష్మి ప్రసంగిస్తూ.. ఆర్టికల్370 ద్వారా ఒకే జెండా ఒకే చట్టం ఒకే దేశం అయ్యిందని భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తదితరులు చేసిన ఈ మార్పుతో నేడు అఖండ దేశంగా మారిందని అన్నారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇప్పుడు ఒకే త్రివర్ణ పతాకం రెపరేపలాడుతుందని అన్నారు. 72 సంవత్సరాల అనంతరం పరిపూర్ణ దేశంగా స్వాతంత్ర్య దినోత్సవం జరిగిందని అందుకే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకే రాజ్యాంగం అమలు చేయడం జరుగుతుందని అన్నారు. అందుకే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు యాత్రను చేపట్టి సెప్టెంబర్3 న కాశ్మీర్ లోని లాల్ చౌక్ లో భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడంతో యాత్ర ముగుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి ప్రసంగిస్తూ దక్షిణ భారతదేశంలో ఓ నారీ ఇలా బులెట్ పై దేశాన్ని చుట్టడం ఇదే ప్రధమమని అన్నారు. ఆ ఖ్యాతి రాజ్యలక్ష్మికి దక్కుతుందని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ నేత బండారు రమేష్ ప్రసంగిస్తూ.. దేశభక్తి, దేశ సమైక్యతకు ఈ యాత్ర నిదర్శనమని ఆయన కొనియాడారు. ఈ స్వాగత కార్యక్రమంలో తెలంగాణ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్, బండారి రమేష్,బిజెపి తెలంగాణ విమోచన కమిటి చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ దేపల్లి అశోక్ గౌడ్, చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి,మనోహర్ రెడ్డి,రాచప్ప, వంశీకృష్ణ, నందిగామ వెంకటేష్, బలబ్రమ్మ చారి,వంశీ,ప్రభు,శేరి విష్ణువర్ధన్ రెడ్డి,ఋషి,సాయి చరణ్ దేవేందర్ రెడ్డి ప్రవీణ్ గజ్జల ,గుంత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.