శ్రీనగర్, ఆగస్టు 5 (way2newstv.com):
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన పట్ల ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ఏకపక్షంగా ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుందన్న ఆయన.. భారత ప్రభుత్వంపై కశ్మీర్ ప్రజలు ఉంచిన నమ్మకాన్ని కేంద్రం వమ్ము చేసిందన్నారు. ఈ నిర్ణయం తీవ్ర పర్యావసనాలకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. ఇది కశ్మీర్ ప్రజలపై దురాక్రమణగా ఆయన అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దు లాంటి పెద్ద నిర్ణయాలేవీ తీసుకోవడం లేదని భారత ప్రభుత్వం, ప్రభుత్వ ప్రతినిధులు మాకు చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రం మొత్తాన్ని, ముఖ్యంగా కశ్మీర్ ప్రాంతాన్ని సైనిక శిబిరంగా మార్చేసి ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ప్రజల గొంతుకను వినిపించే మాలాంటి వారిని నిర్బంధంలో ఉంచారు. లక్షలాది సైనికులను మోహరించారు.
సుదీర్ఘ పోరాటానికి నేషనల్ కాంగ్రెస్ సిద్ధం
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ‘నేను కశ్మీర్ ప్రజలకు ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఏం జరగబోతోందో మాకు తెలియదు. కానీ ఆ అల్లాహ్ ఏది చేసినా మన మంచి కోసమే చేశాడని నేను నమ్ముతాను.దీని ఫలితం ఇప్పుడు కాకున్నా కొద్దిరోజుల తర్వాత కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతీఒక్కరూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి. ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. ప్రశాంతంగా ఉండండి’ అని ట్వీట్ చేశారు. మరో పాలస్తీనాకు మారుతోందిజమ్మూకశ్మీర్ అసెంబ్లీ అనుమతి లేకుండా, ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా ఆర్టికల్ 370ని రద్దుచేశారని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము ఎంతమాత్రం సమర్థించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సోషలిస్టు నేత, దివంగత జయప్రకాశ్ నారాయణ రాసిన ఓ లేఖను ఆయన రాజ్యసభలో చదివారు. ‘ఒకవేళ కశ్మీర్ ప్రజలను అణచివేయాలని భారత్ అనుకుంటే అది భారతీయ ఆత్మకు ఆత్మహత్య సాదృశ్యమే’ అని జయప్రకాశ్ నారాయణ్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. కశ్మీర్ రాష్ట్రాన్ని పాలస్తీనాగా మారేందుకు మనం ఓ దారిని తెరిచామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో కశ్మీర్ పాలస్తీనాగా మారిపోతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా అహాన్ని విడి కశ్మీరీలను కలుపుకునిపోవాలని సూచించారు.
Tags:
all india news