నిర్మల్ ఆగష్టు 9 (way2newstv.com):
ఆదివాసీల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ర్ట అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని శుక్రవారం నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలోని రాంజీగోండు విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీ సంప్రదాయ వేషధారణలో మంత్రి అలరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత ఆదివాసుల అభివృద్దిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
ఆదివాసీల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయం: మంత్రి అల్లోల
అదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆదివాసుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అనేక అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. త్వరలోనే పోడు భూముల సమస్యను పరిష్కరించి, అర్హులైన వారికి ఆర్ఓఎఫ్ఆర్ కింద పట్టాలను అందిస్తామని స్పష్టం చేశారు. ఆదివాసీ గ్రామాల్లో ప్రభుత్వం స్వయంపాలన అమలుచేస్తున్నదని, అందులో భాగంగానే గిరిజన గ్రామాలను పంచాయతీలుగా చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎఫ్ఎస్ సిఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఆదివాసి సంఘం నాయకులు మొసలి చిన్నయ్య, భూమయ్య, మంద మల్లేష్, భీంరావు, టీఆర్ఎస్ నాయకులు ముడుసు సత్యనారాయణ,రాంచందర్, ఉద్యోగ సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Andrapradeshnews